నర్సంపేటలో డ్రైవర్‌ శంకర్‌ విగ్రహం ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

నర్సంపేటలో డ్రైవర్‌ శంకర్‌ విగ్రహం ఏర్పాటు

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

హన్మకొండ : ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్‌ శంకర్‌ విగ్రహాన్ని నర్సంపేట బస్‌డిపోలో ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కిరణ్‌ తెలిపారు. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ వరంగల్‌ రీజియన్‌ అధ్యక్షుడు ఎస్‌వైకె పాషా, కార్యదర్శి జితేందర్‌ రెడ్డితో కలిసి మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ మజ్దూర్‌ యూని యన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథామ రెడ్డిని.. చొల్లేటి కిరణ్‌ కలిసి శంకర్‌ విగ్రహం ఏర్పాటుకు ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌గా సహకరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని కిరణ్‌ తెలిపారు. కార్యక్రమంలో టీఎంయూ నాయకులు గడ్డం రవీందర్‌, ఎండీ గౌస్‌, మూడ్‌ రమేశ్‌ నాయక్‌, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీధర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

విమానయాన రంగంలో

విస్తృత అవకాశాలు

కేయూ క్యాంపస్‌ : విమానయానరంగంలో విస్తృత అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలోని గణిత విభాగం సెమినార్‌హాల్‌లో పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. అనంతరం వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం, కాంపీటివ్‌ కోచింగ్‌ సెల్‌ డైరెక్టర్‌ టి. నాగయ్య మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement