పనికి వెళ్లడం లేదని తండ్రి మందలింపు.. | - | Sakshi
Sakshi News home page

పనికి వెళ్లడం లేదని తండ్రి మందలింపు..

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

క్లుప్తంగా

మనస్తాపంతో కుమారుడి ఆత్మహత్య

స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఘటన

స్టేషన్‌ఘన్‌పూర్‌: పనికి వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఆంజనేయులుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు సంపత్‌(23) డ్రైవింగ్‌ చేస్తుంటాడు. ఇటీవల పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆంజనేయులు భార్య కవిత ఈనెల 10న వేములవాడకు వెళ్లగా తండ్రీకుమారులు ఇంటి వద్ద ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న కుమారుడిని పనికి వెళ్లకుండా ఇంట్లో ఎందుకు ఉంటున్నావని, ఇలా అయితే ఎలా బతుకుతావంటూ తండ్రి మందలించాడు. దీంతో సంపత్‌ మనస్తాపానికి గురయ్యాడు. రాత్రి భోజనం చేసి పడుకున్నారు. సోమవారం ఉదయం నిద్రలేచి చూడగా సంపత్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణు తెలిపారు.

వివాహిత ఆత్మహత్య..

భర్త, ఆర్మీజవాన్‌ రిమాండ్‌

గార్ల: వివాహిత మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై బి. సాయికుమార్‌ సోమవారం తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన యోదుల సతీశ్‌కుమార్‌తో తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజకు వివాహం జరిగింది. కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే జరిగింది. ఈ క్రమంలో 2025లో పిండిప్రోలు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ కాంపాటి శ్రీరామ్‌.. శైలజకు తరచూ ఫోన్‌ చేస్తూ నిన్ను ప్రేమిస్తున్నానని వేధించేవాడు. ఈ విషయం భర్త సతీశ్‌కుమార్‌కు తెలియడంతో శైలజను మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శైలజ 2025లో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు అల్లుడు సతీశ్‌కుమార్‌, ఆర్మీ జవాన్‌ శ్రీరా మ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తలించినట్లు ఎస్సై వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement