అంత్య పుష్కరాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

అంత్య పుష్కరాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌, కమిషనర్‌ ఎం. హనుమంతరావు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఆహ్వాన పత్రిక అందజేశారు. సోమవారం గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లాకు ఆహ్వాన పత్రిక అందజేస్తారని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌జేసీ రామకృష్ణారావు, ఆలయ ఈఓ మహేశ్‌, ఉపప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, వేదపారయనదార్‌ వైకుంఠ పాండా, జూనియర్‌ అసిస్టెంట్‌ దూది శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement