శాయంపేట : మొక్కజొ న్న సొప్ప కాలుస్తూ ప్ర మాదవశాత్తు మంటల్లో పడి రైతు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రా మంలో ఆదివారం జరి గింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోలి జయపాల్‌రెడ్డి(74) వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న సొప్ప కాలుస్తుండగా గాలి పెరగడంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఈ క్రమంలో తప్పించుకునేందుకు పరుగెడుతుండగా కాలుకు ఉన్న చెప్పులు జారిపోయాయి. ప్రమాదవశాత్తు మంటల్లో పడి శ్వాస రాక అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


