ఉపాధి రక్షణ కోసం పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి రక్షణ కోసం పోరాడాలి

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

మరిపెడ రూరల్‌: కూలీ, భూమి, ఉపాధి రక్షణ కోసం కార్మికులు నిరంతరాయంగా పోరాడాలని వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య అన్నారు. బుధవారం మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం 10వ మండల మహాసభలు గుండగాని మధుసూదన్‌ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీరయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు గ్రామీణ పేద మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పి నెరవేర్చలేదన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు రోజుకు కనీసం రూ.600చెల్లించాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బాణాల రాజన్న, అనంతాచారి, భయ్య నీరజ, ఎల్లయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement