చేపలు అమ్మేందుకు వెళ్తూ.. | - | Sakshi
Sakshi News home page

చేపలు అమ్మేందుకు వెళ్తూ..

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

ఏటూరునాగారం: చేపలు విక్రయించేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం 163 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బాల్నె నర్సయ్య(60), గడదాసు రాంప్రసాద్‌ చేపలను సంచిలో వేసుకొని ద్విచక్రవాహనంపై ఏటూరునాగారం నుంచి రొయ్యూర్‌, శంకరాజుపల్లిలో విక్రయించేందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో 163 జాతీయ రహదారి రొయ్యూర్‌ సమీపంలో పెట్రోల్‌ బంక్‌ వద్ద అశోక్‌ అనే వ్యక్తి కారుతో బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో బాల్నె న ర్సయ్య సుమారు 10 మీటర్ల దూరంలో ఎగిరిపడడంతో త లకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. రాంప్రసాద్‌కు తీవ్ర గాయాలుకాగా.. సామాజిక ఆస్పత్రికి అక్కడ నుంచి వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించారు. నర్సయ్య మృతదేహాన్ని పోలీసులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుమారుడు రాజేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మానవత్వం చాటుకున్న తహసీల్దార్‌

రోడ్డు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి కన్నాయిగూడెం తహసీల్దార్‌ సర్వర్‌ కారులో వస్తూ ప్రమాదాన్ని గమనించి ఆగారు. తీవ్రంగా గాయపడిన రాంప్రసాద్‌ను తన కారులో ఎక్కించుకొని సామాజిక ఆస్పత్రికి తరలించారు. మధ్యలో 108 రావడంతో అందులోకి ఎక్కించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మరొకరి పరిస్థితి విషమం

Advertisement
 
Advertisement
Advertisement