న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏడాదిపాటు పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. అయితే పాలక వర్గాల ఏర్పా టు తర్వాత కూడా ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నతీరుగా పాలన సాగుతోంది. పాలక మండలి, చైర్మన్లు, కమిషనర్లు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడింది. ఈ వివాదం చివరకు ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల వద్దకు వెళ్లింది.
కమిషనర్లపై ఆరోపణలు..
జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల్లోని పలువురు చైర్మన్లు, కౌన్సిలర్లు కమిషనర్లపై ఆరోపణలు చేసినట్లు తెలిసింది. మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ తీరుపై చైర్మన్ అసహనం వ్యక్తం చేయడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పనిలో జాప్యం, అందరిని కలుపుకునిపోకపోవడంతో తరచూ వివాదాలు వస్తున్నాయని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. డోర్నకల్, మరిపెడ మున్సిపల్ కమిషనర్లు కుర్చీలకే పరిమితమై ఉంటున్నారని, పట్టణాల్లో సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. తొర్రూరు మున్సిపల్ కమిషనర్ తమను లెక్క చేయడం లేదని కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగులను చిన్నచూపు చూడటం, విధుల్లో నుంచి తొలగించడం వంటి సంఘటనలతో మున్సిపాలిటీ వివాదాలకు నిలయంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. కేసముద్రం మున్సిపాలిటీ సభ్యులను సమన్వయం చేయాల్సిన కమిషనర్ ఏకపక్షంగా ఉంటున్నారని, తీర్మానాలు చేసే విషయంలో కూడా తమను లెక్కలోకి తీసుకోవడం లేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కొత్తవారిలో దూకుడు..
మున్సిపాలిటీల్లో కొత్తగా ఎన్నికై న కొందరు కౌన్సిలర్లు, పలువురు చైర్మన్ల దూకుడు స్వభావంతో సమస్యలు వస్తున్నాయనే చర్చ జరుగుతోంది. వార్డుల్లోని పనులు, భవన నిర్మాణాల అనుమతులు, ఇతర సమస్యల పరి ష్కారం కోసం వార్డు సభ్యులు కమిషనర్లు, ఉద్యోగులపట్ల దురుసుగా ప్రవర్తించడ ం, చైర్మన్లకు బదులు కుటుంబ సభ్యులు పెత్తనం చెలా యించడం ఇబ్బందిగా ఉందని ఉద్యోగులు అంటున్నా రు. కొందరు కౌన్సిలర్లు వివాదాల్లో తలదూర్చడం, వాటిని ఉద్యోగులకు ఆపాదించి తాము అనుకున్నట్లు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
మున్సిపాలిటీల్లో పాలకమండలి,
ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం
మాట వినడం లేదని చైర్మన్ల గగ్గోలు
చైర్మన్ల పెత్తనం ఎక్కువైందని ఉద్యోగుల అసహనం
ఎమ్మెల్యేల వద్దకు వెళ్లిన వివాదం
ఎమ్మెల్యేల వద్దకు వివాదాలు..
మున్సిపాలిటీల్లో చోటుచేసుకున్న సంఘటనలపై కౌన్సిలర్లు, చైర్మన్లు స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నట్లు తెలిసింది. కమిషనర్, ఉద్యోగులు తమను లెక్క చేయడం లేదు.. ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. ఇలా అయితే తమకే కాకుండా పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని చెప్పినట్లు సమాచారం. పద్ధతి మార్చుకొమని చెప్పండి.. లేకపోతే కొత్తవారిని నియమించమని కోరినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలు మున్సిపల్ కమిషనర్లు, ఉద్యోగులను పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులను గౌరవించాలని, మీ పరిధిలో ఉన్న పనులు వెంటనే చేయాలని, పూర్తికాని పనులపై ఒత్తిడి తెస్తే నాకు చెప్పండి అని ఇరువర్గాలకు చెప్పినట్లు సమాచారం. సమన్వయంతో, ప్రవర్తన మార్చుకొని అందరూ కుటుంబంలా ఉండాలని హితవు పలికినట్లు తెలిసింది.


