రోడ్డు ప్రమాదంలో అటవీ శాఖ ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో అటవీ శాఖ ఉద్యోగి మృతి

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

మరొకరికి తీవ్ర గాయాలు

వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం దానవాయి పేట గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అటవీ శాఖ ఉద్యోగి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కల్లూరి లక్ష్మయ్య (55), దేవయ్య అటవీ శాఖ ఉద్యోగులు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా ఆదివారం రాత్రి బైక్‌పై దానవాయిపేట సమీపంలోని టేకు ప్లాంటేషన్‌ వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులో రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్టును తప్పించబోయి బైక్‌ అదుపు తప్పింది. ఈ ఘటనలో సెక్షన్‌ అధికారి దేవయ్య తీవ్రంగా, లక్ష్మయ్య స్వల్పంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను వెంకటాపురం వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో లక్ష్మయ్య మృతి చెందాడు. దేవయ్యను అదే వైద్యశాలకు తరలించారు. లక్ష్మయ్య కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొప్పుల తిరుపతి రావు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement