పెద్దవంగర: ఏ గ్రామంలోనైతే విద్యావ్యవస్థ బలంగా ఉంటుందో, ఆ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎంఈఓ బుదారపు శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల్లో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యావారోత్సవాలపై సర్పంచ్‌లకు, మండలంలోని పలు పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో సర్పంచ్‌ల పాత్ర వెన్నుముక వంటిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు.
చిన్నగూడూరు: విద్యా వారోత్సవాలలో భాగంగా ఎంఈఓ రవికుమార్ అధ్యక్షతన సర్పంచ్‌లకు విద్యా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ జయ్యారం పాఠశాల హెచ్‌ఎం ఉషశ్రీ హాజరయ్యారు.
దంతాలపల్లి: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్పంచ్‌లు సహాయ సహకారాలు అందించాలని ఎంఈఓ శ్రీదేవి అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌లకు నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. హెచ్‌ఎంలు వేణు మాధవరెడ్డి, కృష్ణయ్య మధుసూదన్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
పాఠశాలల అభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం
నెల్లికుదురు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని ఎంఈఓ రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌లకు వర్క్ షాప్ నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు
డోర్నకల్: ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు ఉంటాయని మున్సిపల్ చైర్‌పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్ తెలిపారు. స్థానిక పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యా వారోత్సవాల్లో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్, ఎంఈఓ ఆంగోత్ లక్ష్మానాయక్, హెచ్‌ఎం బండి నర్సింహరావు, తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం: ప్రభుత్వవిద్య బలోపేతానికి సర్పంచులు సహకరించాలని ఎంఈఓ లక్ష్మణ్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యావారోత్సవాల్లో ఎంఈఓ మాట్లాడారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు ధనుంజయ్, ఉప్పలయ్య, లింగరాజు, బయ్యారం సర్పంచ్ శాంతికిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్‌లు కృషి చేయాలి
ఇనుగుర్తి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ రూపారాణి అధ్యక్షతన సర్పంచులతో ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ పార్థసారధి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, పీడీ ప్రణయ్, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
విద్యార్థుల సంఖ్య పెంచాలి
కేసముద్రం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, ఇందుకు సర్పంచులు, వార్డు కౌన్సిలర్‌లు కీలకపాత్ర పోషించాలని ఎంఈఓ కాలేరు యాదగిరి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధి కేసముద్రంవిలేజ్ జెడ్పీ హైస్కూల్‌లో విద్యావారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎంలు బండారు నరేందర్, కోట కనకయ్య, రిసోర్స్ పర్సన్స్ గనె యాదగిరి, పట్నాల స్యతనారాయణ, ఎంఐఎస్ కోఆర్డినేటర్ షేక్ ఖాదర్, సిఆర్‌పీలు పాల్గొన్నారు.
మరిపెడ: ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపాలిటీ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో విద్యాభివృద్ధిపై మరిపెడ వార్డు కౌన్సిలర్లు, సర్పంచులకు అవగాన సదస్సును మరిపెడ ఎంఈవో గాదె అనితాదేవి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ విజయానంద్, వైస్ చైర్మన్ కాలం నునీతారవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అక్తరుద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సదస్సుకు హాజరుకాని సర్పంచ్‌లు
గూడూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లో విద్యా వారోత్సవాలలో భాగంగా మండల సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు 41 మంది సర్పంచ్‌లకు గాను 8మంది మాత్రమే హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం 9 గంటలకు ఇన్‌చార్జ్ ఎంఈఓ సుజాత, గూడూరు సర్పంచ్ జ్యోతి ప్రజ్వల చేసి సదస్సును ప్రారంభించారు. ఈవిషయమై ఎంఈఓ సుజాతను అడగ్గా సర్పంచ్‌లకు సమాచారం అందించామన్నారు.
భాగస్వాములు కావాలి
గార్ల: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో సర్పంచ్‌లు భాగస్వాములు కావాలని ఎంఈఓ మంకిడి వీరభద్రం సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు గంగావత్ రాంసింగ్, బానోత్ పార్వతి హతీరాం పాల్గొన్నారు.


