హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశి కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో జరిగిన యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ (18 సర్కిళ్ల పరిధి) జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా గుగులోతు రాందాస్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈది వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా రావుల రమణారెడ్డితోపాటు పలువురిని కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.


