పుస్తక పఠనంతోనే జ్ఞాన సంపద | - | Sakshi
Sakshi News home page

పుస్తక పఠనంతోనే జ్ఞాన సంపద

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

కేసముద్రం: పుస్తక పఠనం అత్యంత అవసరమని, దీంతో జ్ఞాన సంపద పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక విద్యావారోత్సవాల్లో భాగంగా ఐదోరోజు శుక్రవా రం గ్రంథాలయ దినోత్సవ కార్యక్రమాన్ని కేసముద్రంస్టేషన్‌ జెడ్పీహైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. లక్ష్యసాధనకు పుస్తక పఠనం అవసరమన్నారు. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని, ఎక్కువగా పుస్తకాల పఠనం, పేపర్‌ రీడింగ్‌ను అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బానోత్‌ సునీతవెంకన్న, ఆర్టీఏ మెంబర్‌ రావుల మురళి, ఏసీజీఈ మందుల శ్రీరాములు, డీఎస్‌ఓ అప్పారావు, ఏఎస్‌సీ సంతోష్‌, ఎంఈఓ కాలేరు యాదగిరి, తహసీల్దార్‌ వివేక్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ ఎండి.అయూబ్‌ఖాన్‌, హెచ్‌ఎంలు రాజు, నరేందర్‌, ఏఏపీసీ చైర్‌పర్సన్‌ మంజుల, కౌన్సిలర్లు కనుకుల సుభద్ర, వల్లందాసు ఉమ, అరుణ, వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఈఓ సత్యనారాయణమూర్తి

Advertisement
 
Advertisement
Advertisement