డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్, వైస్ చైర్మన్ మాదా లావణ్యశ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం సాక్షి ఆధ్వర్యంలో తాగునీటి సమస్యలపై నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో వారు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణంతో పైపులు పగిలి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈసందర్భంగా పలువురు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. భగీరథ పైపుల ద్వారా తక్కువస్థాయిలో నీరు రావడంతో వార్డులకు అరకొరగా నీరు సరఫరా అవుతోందన్నారు. ప్రస్తుతం ట్యాంకుల ద్వారా కొన్ని వార్డులకు నీటిని సరఫరా చేస్తున్నామని, యుద్దప్రాతిపదికన పైప్‌లైన్ల మరమ్మతులు చేపడతామన్నారు. తాగునీటి సమస్యలపై మున్సిపల్ సిబ్బందిని నిత్యం అప్రమత్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిపారు.
ప్రశ్న: 13వ వార్డులోని పలు వీధుల్లో తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదు. పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపడతారు?
– పిల్లి శబరీష్, పోటు జనార్థన్‌రావు,
ఎల్లావుల హరికృష్ణ, నీలం సారమ్మ,
పండరినాథ్‌లడ్డా, మహబూబూబ్
జవాబు: రోడ్డు నిర్మాణం, అమృత్ పనులతో పైపులు పగిలి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతో ంది. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తున్నా ం. వార్డుకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తాం.
ప్రశ్న: 11వ వార్డులో పైపులు పగిలి తాగునీరు కలుషితమవుతోంది. రోడ్లు ధ్వంసమై ఇబ్బందులు ఎదురవుతున్నాయి..
– ఎల్లావుల నర్సింహరావు,
జాలా ప్రసాద్, ఎస్‌కే సాధిక్
జవాబు: అమృత్ పనులు పూర్తి కాగానే తాగునీటి కలుషితం కాకుండా చర్యలు చేపడతాం. నీటి కొరతను నివారిస్తాం.
ప్రశ్న: మూడురోజులకోసారి అరకొరగా నీరు సరఫరా అవుతోంది..
–భాస్కర్, మహ్మద్ అజ్గర్, ఎస్‌కే నేహాకౌషర్, భవాని, సుభాష్‌వీధి, బషీర్ అలీ, శాంతినగర్, చాంద్‌పాషా అంబేడ్కర్‌నగర్, అక్కిరెడ్డి పద్మ, న్యూ నెహ్రూ స్ట్రీట్
జవాబు: ప్రస్తుతం నీటి కొరతతో భగీరథ ద్వారా సరఫరా తక్కువగా ఉంది. త్వరలో సమస్య పరిష్కరిస్తాం.
ప్రశ్న: మున్నేరువాగు నీటిని సరఫరాచేయరా..?
– దేవర వెంకటేశ్వర్లు, అంబేడ్కర్‌నగర్
జవాబు: త్వరలో విద్యుత్ మోటార్లను అమర్చి నీటి కొరత ఉన్న సమయాల్లో మున్నేరువాగు నుంచి నీటిని సరఫరా చేస్తాం.
ప్రశ్న: కాల్వలు తవ్వి వదిలేశారు..
– రాజేందర్‌సింగ్, సుభాష్ స్ట్రీట్
జవాబు: పైప్‌లైన్లు, డ్రెయినేజీల కోసం రోడ్లను తవ్వడంతో ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: నీటి సరఫరా ఇబ్బందులు పరిష్కరించరా?
– గుండ్రాల భాస్కర్, వీరన్న, ఇందిరానగర్
జవాబు: భగీరథ లైన్ ద్వారా తక్కువ నీరురావడం, లీకేజీలతో నల్లాల ద్వారా తక్కువ నీరు వస్తుంది. త్వరలో సమస్య పరిష్కరిస్తాం.
సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమానికి
విశేష స్పందన
నీటి సమస్యపై ప్రజల నుంచి పలు ప్రశ్నలు
పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్
కొండేటి రాజకుమారి, వైస్ చైర్‌పర్సన్
మాదా లావణ్య


