వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మూడో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. అండర్–16,18,20 బాలబాలికలు, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో నిర్వహించిన పోటీలకు సుమారు 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అథ్లెట్లకు హైజంప్, లాంగ్ జంప్, జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో, హ్యామర్‌త్రో, షాట్‌పుట్, ట్రిపుల్ జంప్, 400 మీటర్ల పరుగు ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన ముగింపు వేడుకల్లో అథ్లెటిక్స్ అసోసియేషన్ బా ధ్యులు ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీ డాకారులకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు.
400 మంది క్రీడాకారులు హాజరు


