రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి
కేసముద్రం: కేసముద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పాలిటెక్నిక్ కళాశాల, 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణం, కేసముద్రంవిలేజ్ జెడ్పీ హైస్కూల్ ప్రహరీ నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులను బుధవారం ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి, పాలిటెక్నిక్ కాలేజీ భవన నిర్మాణ పనులకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని, పనుల్లో జాప్యం జరగకుండా, సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ముందుగా తన సొంత గ్రామం అర్పనపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేం నరేందర్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, జిల్లా అధికార ప్రతినిధి మహేందర్‌రెడ్డి, దస్రూ నాయక్, దుర్గేష్, వెంకన్న, శ్రీని వాస్‌రెడ్డి, ఉమ, రవి, నాగరాజు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గ్రామాల్లో సర్పంచ్‌లు, పట్టణాల్లో కౌన్సిలర్లు సహకరించాలని డీఈఓ సత్యనారాయణ మూర్తి అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్‌లో బుధవారం సర్పంచ్‌లు, వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులకు విద్యావారోత్సవాల్లో భాగంగా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేయడానికి సర్పంచ్‌ల సేవలు వినియోగించాలన్నారు. పాఠశాల విద్యాశాఖ కార్యక్రమాలు, సాధించిన విజయాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనితీరు, పాఠశాలలో మౌలిక వసతులు, బడిబాట కార్యక్రమాలపై అవగాహన కలిగిఉండాలన్నారు. అనంతరం ఎంఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికలు పెరిగేలా స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం సర్పంచ్‌లు, వార్డు కౌ న్సిలర్లను విద్యాశాఖ అధికారులు సన్మానించా రు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు గిరిజ, పూజరి వీరయ్య, ఉపేందర్‌రావు, ఆరుద్ర వెంకటేశ్వ ర్లు, వార్డు కౌన్సిలర్లు రమ్య, భాస్కర్, నవీన్ పాల్గొన్నారు.


