అమ్మ నింపిన ధైర్యమే ఉద్యోగస్తున్ని చేసింది | - | Sakshi
Sakshi News home page

అమ్మ నింపిన ధైర్యమే ఉద్యోగస్తున్ని చేసింది

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

సాక్షి, మహబూబాబాద్‌: మాది ఉమ్మడి కుటుంబం. అమ్మాన్నాన్నలు లక్ష్మీ, నరసింహం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఇంట్లో నేనే పెద్ద కొడుకును. నామీదనే అందరి ఆశలు. అందుకోసమే చిన్నప్పటి నుంచి నేను బాగా చదవాలని అమ్మ చెబుతుండేది. పరీక్షల్లో వచ్చిన మార్కులు కూడా అమ్మే చూసి సంతోషపడేవారు. పోలీస్‌శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్‌ చూసి అమ్మకు చెప్పాను. ఈ ఉద్యోగం నీకు వస్తుంది.. నీకు ఆ శక్తి ఉందని ధైర్యం నింపింది. ఆమె చెప్పినట్లుగానే ఉద్యోగం సంపాదించాను. అప్పుడు ఆమె కళ్లల్లో చూసిన ఆనందం ఇప్పటికి మరవలేను. నన్ను చూసి మా అన్నదమ్ముళ్లు, ఆక్కా చెల్లెళ్లు బాగా చదివారు. మంచి పొజీషన్‌లో ఉన్నారు. అమ్మ మాతోనే ఉంటుంది. పని ఒత్తిడి, ఇతర సమస్యలు వచ్చినప్పుడు అమ్మతో మాట్లాడితే అంతా పోతుంది.

– ఎన్‌.తిరుపతిరావు, డీఎస్పీ మహబూబాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement