పైపులైన్‌ మరమ్మతు | - | Sakshi
Sakshi News home page

పైపులైన్‌ మరమ్మతు

May 13 2026 1:14 AM | Updated on May 13 2026 1:14 AM

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఇటీవల నిర్వహించిన ‘సాక్షి ఫోన్‌ఇన్‌’ కార్యక్రమం ఫలితాలిస్తోంది. ఈమేరకు ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొండేటి రాజకుమారిహరినాథ్‌ ఆదేశాల మేరకు మంగళవారం బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ సమీపంలో రోడ్డు కింది పగిలిన పైపులైన్‌ మరమ్మతులు చేపట్టారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఆదేశాల మేరకు తాగునీటి సమస్యలు పరిష్కారమవుతున్నాయని కాంగ్రెస్‌ నాయకులు హరినాథ్‌, మాదా శ్రీనివాస్‌ తెలిపారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులు

నిబంధనలు పాటించాలి

తొర్రూరు: ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు, స్కానింగ్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్లను మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రుల్లోని రికార్డులు, ఔట్‌ పేషెంట్‌, ఆపరేషన్‌ థియేటర్‌లను పరిశీలించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనల మేరకే వైద్యం అందించాలని, క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం–2010 ప్రకారం నిర్వహణ చేపట్టాలన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే సీజ్‌ చేస్తామన్నారు. బోర్డులపై చికిత్సల ధరలు ప్రదర్శించాలన్నారు. ఇరుకు గదుల్లో ఆస్పత్రులు నిర్వహించవద్దన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అర్హత కలిగిన రేడియాలజిస్టు, గైనకాలజిస్ట్‌ మాత్రమే గర్భిణులకు స్కానింగ్‌ చేయాలన్నారు. తనిఖీలో ప్రోగ్రాం ఆఫీసర్‌ విరాజిత, వైద్యాధికారి జ్వలిత, హెచ్‌ఈఓ లోక్యా, మనోహర్‌ పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌ సహకారంతో యూపీఎస్‌, సీఎస్‌ఏటీ–2027 ప్రవేశ పరీక్ష శిక్షణకు అర్హులైన మైనార్టీ(క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి శ్రీనివా స్‌రావు మంగళవారం తెలిపారు. మహిళా అభ్యర్థ్ధులకు 33.33 శాతం సీట్లు, రిజర్వ్‌ కేటగిరీలో దివ్యాంగులకు 5శాతం సీట్లు కేటాయిస్తారని చెప్పారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 5లక్షలకు మించొద్దన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. ఆన్‌లైన్‌ హెచ్‌టీటీపీఎస్‌.సీఈటీ.సీజీజీ.గౌట్‌.ఇన్‌.టీమ్రీస్‌ వెబ్‌సైట్‌లో ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేయాలన్నారు. జూన్‌ 14న జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు 91825 40680 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలన్నారు.

ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు..

తెలంగాణ ఉపాధి శిక్షణశాఖ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ బి. ఓంకార్‌ మంగళవారం తెలిపారు. ఆన్‌లైన్‌లో హెచ్‌టీటీపీఎస్‌.ఐటీఐ.తెలంగాణ.గౌట్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో నెల 14నుంచి జూన్‌ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాలను సంప్రదించాలన్నారు.

లక్ష్యాలు ఎంచుకుని చదవాలి

కేసముద్రం: విద్యార్థులు మంచి లక్ష్యాలను ఎంచుకుని చదవాలని, అప్పుడే భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదుగుతారని కేసముద్రం మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ బానోత్‌ సునీతవెంకన్న, వైస్‌ చైర్‌పర్సన్‌ అల్లం రమనాగేశ్వర్‌రావు అన్నారు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళికలో భాగంగా మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. అనంతరం జిజ్ఞాస స్టూడెంట్స్‌ స్టడీ ప్రాజెక్ట్‌ రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.రాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement