బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇవాళ(జనవరి 18, ఆదివారం) ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. నిన్న(శనివారం) నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. నలుగురు మహిళా మావోయిస్టులతో సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
ఇప్పటివరకు లభించిన ఆరుగురు మృతదేహాలలో నలుగురిని గుర్తించారు. దిలీప్ బెడ్జా (నేషనల్ పార్క్ ఏరియా కమిటీ), మాడ్వి కోసా, లఖీ మడ్కామ రాధా మెట్టా(పార్టీ మెంబర్)లను గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, 303 రైఫిల్, ఇన్సాస్, రైఫిల్‌తో పాటు భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బీజాపూర్ జిల్లా వాయవ్య ప్రాంతంలోని అటవీ, కొండ ప్రాంతాల్లో మావోయిస్టు నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి చెందిన డీవీసీఎం దిలీప్ బెడ్జా, ఇతర సాయుధ మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ పట్టిలింగం మాట్లాడుతూ.. బస్తర్ ప్రాంతంలో శాంతి భద్రతలు, ప్రజా సంక్షేమం కోసం డీఆర్‌జీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్, స్థానిక పోలీసులు పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు.


