బీజాపూర్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌లో 52 మంది మావోయిస్టలు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా చూస్తూ లొంగిపోయిన మావోయిస్టులపై రూ. 1. 14 కోట్ల రివార్డు ఉంది. కాగా, ఇటీవల కాలంలో మావోయిస్టుల భారీగా లొంగిపోతున్నారు. గత రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 120కి పైగా మావోయిస్టులు లొంగిపోయారు.
కేంద్ర ప్రభుత్వం మార్చి నెల చివర నాటికి మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఉంది. మావోయిస్టు దళాలు.. అడవులను వదిలి జన జీవన స్రవంతిలోకి రావాలని కేంద్రం పిలుపునిచ్చింది. దీనిలో భాగంగానే మావోయిస్టులు లొంగిపోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్ వంటి చర్యలతో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.


