విధి వెక్కిరించినా, సమాజం వెక్కిరించినా, తన కలను వదులకోలేదు. పట్టుదలగా తను అనుకున్నదిసాధించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఆయనే భారతదేశానికి చెందిన 3 అడుగుల డాక్టర్ గణేష్ బరయ్య. తన కల సాకారం కోసం ఆయన చేసిన పోరాటం అంతా ఇంతాకాదు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన మూడు అడుగుల గణేష్ ( 25) తాను పోరాడి సాధించిన MBBS కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ వైద్య అధికారిగా నియమితుడయ్యారు. వికలాంగులకు చట్టపరమైన అడ్డంకులను అధిగమించి సివిల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేస్తున్నారు. అందుకే ఆయన పేరు దేశ మంతా మారిమోగిపోతోంది.
గ్రోత్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ కారణంగా పుట్టుకనుంచి గణేష్ ఎదుగుదల సమస్య వచ్చింది. అందుకే ఆయన ఎత్తు మూడు అడుగులకే పరిమితం అయింది. మరుగుజ్జుత్వం కారణంగా 72శాతం లోకోమోటర్ వైకల్యంతో జన్మించిన గణేష్ బరయ్య కేవలం మూడు అడుగుల పొడవు , 20 కిలోల బరువు మాత్రమే. శారీరకంగా ఉన్న సమస్య కారణంగా చిన్నతనంనుంచే ఎన్నో అవమానాలు, అవహేళలను తప్పలేదు.
2018లో నీట్ యుజి పరీక్ష రాసిన సందర్భంగా అతనిలోని వైకల్యం కారణంగా భారత వైద్య మండలి ఆయన్ను తిరస్కరించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MBBS కోర్సుకు అడ్మిషన్ తిరస్కరించడంతో గుజరాత్ హైకోర్టులో కేసు వేశారు. అక్కడా ఫలితం దక్కలేదు. అక్కడితో ఆగిపోలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి 2019లో మీకు సీటు రిజర్వ్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వైకల్యం కారణంగా ఎవరూ మిమ్మల్ని ఆపలేరని గణేష్ బరయ్యకు హామీ ఇచ్చింది. చట్టపరమైన ఖర్చులను భరించడంలో సహాయపడిన గణేష్ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దల్పత్‌భాయ్ కటారియా మద్దతుతో, బరయ్య సంకల్పం ఫలించింది.
ఇదీ చదవండి: సమంత-రాజ్ పెళ్లి వేడుక : అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!
రోగులు మొదట్లో చికిత్సను నిరాకరించిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అయినా తను అలాంటి వాటి గురించి పట్టించుకోనని, దానికి బదులుగా తనతో సానుకూలంగా ఉన్న చాలా మంది రోగులపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు. వైద్య అధికారిగా తనతదుపరి లక్ష్యం తన కుటుంబంకోసం ఒక మంచి ఇల్లు కట్టి ఇవ్వాలనేది. భావ్‌నగర్ జిల్లాలోని గోర్ఖి గ్రామంలోని కచ్చా ఇంట్లోనే నివసిస్తోంది. వారికి అన్ని సౌకర్యాలతో కూడిన ఇటుక ఇల్లు నిర్మించడం అనేది తన డ్రీమ్ అని చెప్పారు.
#WATCH | Bhavnagar, Gujarat: Dr Ganesh Baraiya overcomes legal hurdles being differently abled and works as a medical officer in a civil hospital.
He says, "... My primary education was from my village... I took the NEET UG exam in 2018 but at that time, the Medical Council of… pic.twitter.com/K2Ai2VeJ8c— ANI (@ANI) December 2, 2025


