రాత్రి 9:30 తరువాత అన్నీ బంద్‌ | Suhas Shetty Murder Case Mangaluru | Sakshi
Sakshi News home page

రాత్రి 9:30 తరువాత అన్నీ బంద్‌

May 7 2025 9:39 AM | Updated on May 7 2025 9:39 AM

Suhas Shetty Murder Case Mangaluru

మంగళూరులో పోలీసుల ఆదేశం 

దొడ్డబళ్లాపురం/బనశంకరి: మంగళూరులో గత గురువారం రాత్రి హిందూ కార్యకర్త సుహాస్‌శెట్టి హత్య తరువాత నివురుగప్పిన నిప్పులా మారింది. ప్రజల్లో భయం నెలకొంది. ఇంతలో మరో హిందూ కార్యకర్త భరత్‌ కుమ్దేల్‌ను సోమవారం రాత్రి 9–30కి హత్య చేస్తామని కొందరు గుర్తుతెలియని దుండగులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి నుంచి అన్ని వ్యాపార, వ్యవహారాలను రోజూ రాత్రి 9:30కి బంద్‌ చేయాలని ఆదేశించారు. రేవు సిటీలో పరిస్థితులు చక్కబడే వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.  

హెడ్‌కానిస్టేబుల్‌ హస్తం  
సుహాస్‌శెట్టి హత్యలో రోజూ కొత్త సంగతులు బయటపడుతున్నాయి. రషీద్‌ అనే హెడ్‌కానిస్టేబుల్‌ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుహాస్‌శెట్టి బజ్పేలో ఇంట్లో ఉండగా రషీద్‌ కావాలనే ఠాణాకు పిలిపించి వేధించేవాడని ఆరోపణలున్నాయి. వాహనంలో ఎలాంటి ఆయుధాలు ఉండరాదు, నీ జతలో స్నేహితులు ఉండరాదని హెచ్చరించాడని సుహాస్‌శెట్టి తల్లి ఆరోపించారు.

    

Advertisement
 
Advertisement
Advertisement