ఎంత పని చేశావ్‌ బ్రహ్మయ్య! | pacha Rayi gold Incident in nellore | Sakshi
Sakshi News home page

బంగారు ఉంగరం.. బ్రహ్మాయ్య ఎంత పని చేశావయ్యా!

Jun 4 2025 1:52 PM | Updated on Jun 4 2025 4:59 PM

pacha Rayi gold Incident in nellore

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: తోపూరి నరసింహంను దారుణంగా హత్య చేసిన చలంచర్ల బ్రహ్మయ్యను అరెస్ట్‌ చేసి కందుకూరు కోర్టులో హజరుపరిచినట్లు గుడ్లూరు సీఐ మంగారావు చెప్పారు. బంగారు ఉంగరం కోసమే బ్రహ్మయ్య హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. 

వివరాలను సీఐ మంగళవారం వెల్లడించారు. పొన్నలూరు మండలం రావులకొల్లు గ్రామానికి చలంచర్ల బ్రహ్మయ్య కుటుంబ సభ్యులతో పదేళ్ల నుంచి పెంట్రాల ఎస్టీ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. గత నెల 30వ తేదీన నరసింహం నిమ్మతోటకు కంచె వేసేందుకు బ్రహ్మయ్యను తీసుకెళ్లాడు. పని చేస్తుండగా నరసింహం చేతికున్న పచ్చరాయి బంగారపు ఉంగరాన్ని చూసి దానిని ఎలాగైనా దక్కించుకోవాలని బ్రహ్మయ్య భావించాడు. నరసింహంను మొద్దుకత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

అనంతరం ఉంగరాన్ని తీసుకుని కందుకూరులో విక్రయించాడు. రాత్రి మృతదేహాన్ని పక్క పొలంలోకి లాక్కెళ్లి ముక్కలుగా నరికి బోరుబావిలో పడేశాడు. బ్రహ్మయ్యను విచారించగా తాను బంగారు ఉంగరం కోసమే నరసింహంను హత్య చేసినట్లు అంగీకరించాడని సీఐ చెప్పారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కందుకూరు కోర్టులో హాజరుపరచగా మేజి్రస్టేట్‌ రిమాండ్‌ విధించినట్లు వెల్లడించారు.   

Advertisement
 
Advertisement
Advertisement