
సాక్షి, నెల్లూరు: పెన్నా నది సమీపంలో డబుల్ మర్డర్ కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు టవర్ డంప్‌ను సంతపేట పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులను అతిత్వరలో పట్టుకుంటామని ఎస్పీ చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై రక్తపు మరకలు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో రెండు మృతదేహాలను పోలీసులు మంగళవారం వెలికి తీశారు. హత్య చేసి నదిలో పడేసి ఉంటారని.. అర్ధరాత్రి సమయంలో ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మృతుల వివరాల కోసం సమీపంలోని గిరిజన తండాల్లో ఆరా తీస్తున్నారు.