పారిశ్రామిక వినియోగదారుల ప్రత్యేక వేదిక నేడు | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక వినియోగదారుల ప్రత్యేక వేదిక నేడు

Mar 4 2026 8:19 AM | Updated on Mar 4 2026 8:19 AM

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ ఆదేశాలతో బుధవారం నెల్లూరులోని విద్యుత్‌ భవన్‌లో పారిశ్రామిక విద్యుత్‌ వినియోగదారుల ప్రత్యేక వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్‌ఈ రాఘవేంద్రం అన్నారు. నగరంలోని విద్యుత్‌ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతినెలా మొదటి బుధవారం జిల్లాలోని పారిశ్రామిక విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామన్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య సమస్యలు చెప్పొచ్చన్నారు.

కండలేరులో

52.960 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 52.960 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,100, లోలెవల్‌ కాలువకు 100, హైలెవల్‌ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్‌ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement