అయేషా మీరా హత్య కేసులో విచారణ వాయిదా | Trial in Ayesha Meera assassination case postponed | Sakshi
Sakshi News home page

అయేషా మీరా హత్య కేసులో విచారణ వాయిదా

Jun 28 2025 4:38 AM | Updated on Jun 28 2025 4:38 AM

Trial in Ayesha Meera assassination case postponed

సాక్షి, అమరావతి: అయేషా మీరా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఫైనల్‌ రిపోర్ట్‌ కోసం సంబంధిత కోర్టునే ఆశ్రయించాలని హతురాలి తల్లిదండ్రులకు హైకోర్టు స్పష్టం చేసింది. తుది నివేదిక తమకు ఇవ్వాలంటూ అయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ను రికార్డుల్లో చేర్చాలని తమ రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 4కి వాయిదా వేస్తూ జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement