
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,హైదరాబాద్: కూకట్‌పల్లిలో మైనర్ బాలిక (12)హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మైనర్ బాలికను హత్య చేసిన నిందితుణ్ని సీసీటీవీ ఫుటేజీల్లో గుర్తించారు.బాలికను హత్య చేసిన అనంతరం నడుచుకుంటూ బయటకు వస్తున్న దృశ్యాల్ని గమనించారు. అయితే, బాలికపై లైంగిక దాడికి పాల్పడేందుకు నిందితుడు ప్రయత్నించాడని.. ఆమె ప్రతిఘటించడంతో దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
సోమవారం కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సంగీత్‌నగర్‌లో ఓ మైనర్ బాలిక(12) దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఒంటరిగా ఇంట్లోనే ఉన్న బాలికపై నిందితులు ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని
గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.