
గద్వాల క్రైం: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితులైన ఏ–1 తిరుమలరావు, ఏ–2 ఐశ్వర్య అలియాస్ సహస్రను గద్వాల కోర్టు అనుమతితో ఈ నెల 26న రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు.. గడువు ముగియడంతో సోమవారం కోర్టులో తిరిగి హాజరుపరిచారు. దీంతో కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల విచారణలో నిందితులు పొంతనలేని సమాధానాలతో కేసు దర్యాప్తును గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేశారని గద్వాల సీఐ శ్రీను పేర్కొన్నారు. అందువల్ల వారిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతామన్నారు.