మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం | Incident in Sri Potti Sriramulu Nellore district | Sakshi
Sakshi News home page

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

Feb 9 2026 5:32 AM | Updated on Feb 9 2026 5:32 AM

Incident in Sri Potti Sriramulu Nellore district

సీఐ వేధింపులే కారణమని ఆరోపణ

సీతారామపురం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆదివారం నిద్రమాత్రలు మింగి స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన సహచర సిబ్బంది ఆమెను వింజమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందారు. అనంతరం స్వగ్రామం ఉదయగిరి వెళ్లిన ఆమె అక్కడ పాత్రికేయులతో మాట్లాడారు. ఉదయగిరి సీఐ వెంకట్రావు.. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన సీతారామపురం ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ  నేపథ్యంలో తనకు ఎస్‌ఐతో వివాహేతర సంబంధాన్ని అంటగట్టి సీఐ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారాన్ని అందించారని ఆరోపించారు.

అందువల్లే ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారని చెప్పారు. తిరిగి ఎస్‌ఐపై ఉన్నతాధికారులకు తప్పుడు ఆరోపణలు చేసి అతని సస్పెన్షన్‌కు కారణమయ్యానని తనపైనే సీఐ నిందలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత కుటుంబానికి చెందిన తనతో సీఐ ఐదు నెలలుగా అవమానకరంగా మాట్లాడుతున్నారని, వీటిపై ప్రశ్నించినందుకు తనపై కక్షగట్టి నిందారోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వంపై ప్రతి ఒక్కరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement