breaking news
security guard arrested
-
పొరుగింటి వ్యక్తే హంతకుడు
కృష్ణరాజపురం: నగరంలోని మహాదేవపురలో ఓ యువతిని హత్య చేసి ఇంటి ముందు పడేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. నగరంలోని మహాదేవపుర పరిధిలో లక్ష్మీ సాగర లేఔట్లో గుల్బర్గాకు చెందిన మహానంద (21) అనే యువతి కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం మహానంద బయటకు వెళ్లి ఆ తరువాత ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనూహ్యంగా మరుసటి రోజు ఇంటి ముందే విగతజీవిగా పడి ఉంది. యువతిని ఇంటిలోకి లాక్కెళ్లి అత్యాచార యత్నం : ఈ యువతి ఇంటి పక్కనే ఒడిస్సాకు చెందిన కృష్ణ చంద అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆ రోజు మహానంద బయటకు వచ్చిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో కృష్ణచంద యువతిని తన ఇంటిలోకి లాక్కెళ్లాడు. అత్యాచారం చేయడానికి యత్నించాడు. ఈ క్రమంలో ఆమె అరవకుండా చేయడానికి యత్నించగా ఊపిరి ఆగిపోయింది. దీంతో ఏమి చేయాలో తెలియక ఒక బెడ్ షీట్ చుట్టి మూలలో పెట్టాడు. సాయంత్రం భార్య విధులు ముగించుకుని ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి భార్యకు తెలియకుండా మహానంద యువతి శవాన్ని బయటకు తీసుకువచ్చి వారి ఇంటి ముందే పడేశాడు. పోలీసులు అనుమానంతో కృష్ణచందను అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం వెల్లడించాడు. కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. -
మహిళా లెక్చరర్లకు అశ్లీల మెసేజ్‌లు..అరెస్ట్
బెంగళూరు : మహిళా లెక్చరర్లకు అశ్లీల సందేశాలు పంపిన సెక్యూరిటీగార్డును బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లేశ్వరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో మహేంద్ర అనే యువకుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతను ఇదే కాలేజీకి చెందిన ఓ విద్యార్థి సెల్‌ఫోన్‌తో నలుగురు మహిళా లెక్చరర్లకు అశ్లీల మెసేజ్ పెట్టాడు. ఈ ఘటనపై జనవరి 13న బాధితులు మల్లేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెసేజ్ వచ్చిన నంబర్ ఆధారంగా విచారణ చేపట్టారు. సెల్‌ఫోన్ విద్యార్థినికి సంబంధించినదని తెలియడంతో ఆరా తీయగా అశ్లీల సందేశాలు పంపింది సెక్యూరిటీ గార్డు అని తేల్చారు. ఈమేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.