
శ్రీరామ పట్టాభిషేకం మూర్తి ప్రతి ఇంటిలోనూ ఉండాలి. ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు, స్త్రీలు, పలకకూడదు. కానీ ’ఓం’కారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం. పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేక మూర్తిలో నలుగురే ఉంటారు – సీతారాములు, లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ. రాముడు అకారానికి ప్రతినిధి,
యో వేదాదౌ స్వరప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!.
అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతమ్మ. ’మ్’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమ. అకార ఉకార మకార నాద స్వరూపమైనటువంటి హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రమూర్తి పట్టాభిషేక మూర్తిగా ఉంటుంది.
ఆయనకి పూజ చేయడానికి వాళ్ళు చేయవచ్చా? వీళ్ళు చేయవచ్చా? అని అభ్యంతరం ఉండదు. కాబట్టి ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయడం అంత గొప్పది.
(చదవండి: కొలిచిన వారికి 'బంగారు తల్లి'! పులి రూపంలో తిరుగుతూ..)