
జిజ్ఞాస
కౌసల్యా సుప్రజా రామా ..ఈ సుప్రభాతం ఈ నాటిది కాదు. ఏడువందల సంవత్సరాలుగా గానం చేస్తున్నాం. సుప్రజ అంటే మంచి బిడ్డ. కౌసల్య ముద్దు బిడ్డ ఐన రామా! అని విశ్వామిత్ర మహర్షి పిలుపు.
రాముణ్ణి మేల్కొలిపేటప్పుడు కౌసల్య మహర్షికి ఎందుకు గుర్తు వచ్చిందో తెలుసుకుందాం. ఆ అమ్మ పెంపకంలో రాముడు లోకాభిరాముడయ్యాడు. ప్రతిరోజూ ఆమె మేలుకొలుపుతో లోకాన్ని చూసేవాడు. ఆ తల్లిని తలచుకుంటూ... ఆమె ముఖం చూస్తూనే రోజూ నిద్ర లేస్తాడు కౌసల్య ముద్దుబిడ్డ రాముడు.

శ్రీ రాముడిలో తల్లి పెంపకంలోని ధైర్యం, కర్తవ్య అవ్యగ్రతలను మహర్షి దర్శించాడు. అందుచేత ఆ పిలుపు. ఆ శ్రీ రాముడే ఆ శ్రీ కృష్ణుడే ఈ కలియుగ వైకుంఠంలో ఆర్త రక్షా దీక్షితుడైన శ్రీ వేంకటేశ్వరుడు అని సుప్రభాత దర్శనం చేసుకొనే పుణ్యాత్ములందరికీ తెలియజేస్తూ మీరు ఆ వైకుంఠుణ్ణే ఈ రూపంలో చూడండి! అని సూచిస్తున్నారు వేంకటేశ్వర సుప్రభాతాన్ని రచించిన ప్రతివాది భయంకర హస్తిగిరి(కంచి) నాథన్ అణ్ణన్ ఆచార్యులు. దశావతారాలతో ఈ భువికి వచ్చిన ఆర్తత్రాణ పరాయణుడూ ఈయనే అని జ్ఞప్తి చేశాడాయన.
ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు