నాడు సన్యాసి.. ఇవాళ కంపెనీ సీఈవోగా..! | How spirituality shapes CEO Shobhit Singhs business philosophy | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికత నుంచి.. ఏకంగా కంపెనీ సీఈవోగా ప్రస్థానం..

May 21 2025 11:48 AM | Updated on May 21 2025 12:49 PM

How spirituality shapes CEO Shobhit Singhs business philosophy

ఎందరో మేధావులు, ప్రముఖులు జీవితంలో అనుభవించాల్సిన ఆనందమంతా పొంది, బాధ్యతలు కూడా నెరవేర్చి.. చరమాంకంలో ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేస్తుంటారు. ఇక వారి శేష జీవితాన్ని ఆ దేవుని సేవకు అంకితం చేసిన ఎందరో భక్తాగ్రేసులను చూశాం. అలా కాకుండా వారందరికంటే భిన్నంగా..ఓ వ్యక్తి ఆధ్యాత్మికత నుంచి ఆధునిక జీవన విధానంలోకి వచ్చాడు. ఆయన ఆధ్యాత్మికంగా పరిపక్వత చెంది..చివరికి ప్రాంపించిక జీవితంలోకి రావడమే గాక..కోట్లు టర్నోవర్‌ చేసే కంపెనీకి సీఈవోగా ఎదిగారాయన. అంతేగాదు కుటుంబ జీవనంలో బతుకుతూనే ఆధ్యాత్మికంగా బతకొచ్చు అని నిరూపించాడు. పైగా అది మన జీవితంలో భాగమే గానీ ఎక్కడో దేవాలయాల్లో, మఠాల్లోనూ పొందే సిద్ధాంతం కాదని అంటారాయన. అది మన జీవన విధానానికే పునాది..అదే కేంద్రం బిందువని చెప్పకనే చెప్పాడు.

ఆయనే స్టోన్ సఫైర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శోభిత్ సింగ్. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సింగ్  చిన్నప్పటి నుంచి తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతవైపు ఆకర్షితుడయ్యాడు. అలా తన చదువు పూర్తి చేసుకున్న వెంటనే..కేవలం 26 ఏళ్లకే రిషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు. అక్కడే వేద అధ్యయనం చేశాడు. 

ఇక పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోనే నడవాలని భావించాడు. అలా ఆ రిషికేశ్‌ ఆశ్రమం మహర్షి సంస్థలో సభ్యుడిగా కూడా మారాడు. పూర్తి సన్యాసి జీవితం గడుపుతున్న శోభిత్‌ సింగ్‌  మఠాన్ని విడిచి పెట్టి..ప్రాపంచిక జీవితంలో గడుపుతూ ఆధ్యాత్మికంగా ఉండొచ్చు అని విశ్విసించడం మొదలుపెట్టాడు. ఆయనకు ఆ ఆశ్రమంలో ఉండగానే ఆధ్యాత్మికత అంటే కేవలం ఆచారాలు లేదా ఏకాంతం లేదా 'సంసారం' నుంచి నిష్క్రమించడం కాదని బోధపడింది. 

మన దైనందిన జీవితంలో ప్రతిపాత్రలో దీన్ని విలీనం చేసి బతికే జీవన విధానమే అది అని తెలుసుకున్నానని చెబుతున్నాడు శోభిత్‌. అప్పుడే స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యా..అందరిలా జనజీవన స్రవంతిలో చేరి కార్పొరేట్‌ ప్రంపంచలో బతుకుతూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా బతకచ్చో ఆచరించి చూపాలని నిర్ణయించుకున్నారట శోభిత్‌ సింగ్‌

ఆ నేపథ్యంలోనే కొత్తమంది స్నేహితులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా విజయాలను అందుకున్నానని అన్నారు. ఈ పోటీతత్వంతో కూడిన కార్పొరేట్‌ వరల్డ్‌లో కూడా తన ఆలోచన విధానంలో ఎట్టి మర్పు రాలేదని ధీమాగా చెబుతున్నారు శోభిత సింగ్‌. ఆశ్రమంలో లేదా వ్యాపారంలో అయినా..తాను ఆధ్యాత్మికత విద్యార్థినే అంటారు. ఇక్కడ ఆధ్యాత్మికత..వినయం, సానుకూలత, సానుభూతి, గ్రహణశక్తి  తదితరాలను ప్రతిబింబిస్తే..వ్యాపారంలో రాణించాలంటే కూడా ఇవన్నీ అవసరం..అదే నన్ను వ్యవస్థాపక జీవితంలోకి తీసుకొచ్చాయని నవ్వుతూ చెబుతారాయన. 

అదే వ్యాపార సూత్రం..
ఆధ్యాత్మికత ప్రాథమిక విలువలైనా..బహిరంగత, వినయం, సానుకూలత, సానుభూతి, ఆత్మపరిశీలన, గ్రహణశక్తి తదితరాలే నా వ్యాపార సూత్రాలంటారు ఆయన. వాటితోనే తాను అందరితో సంబంధాలు నెరపీ..వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. అలాగే ప్రతి వ్యక్తికి 200% జీవితం ఉంటుందట. అంటే 100% అంతర్గత (ఆధ్యాత్మిక), ఇంకో 100% బాహ్య జీవతానికి కేటాయించి ఉంటుందంటారు సింగ్‌. 

ఈ ఆధ్యాత్మికత ప్రయాణం వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా స్పష్టమైన వైఖరితో ఉండటం నేర్పిస్తుందట. పైగా అన్నివేళల మంచి స్పృహతో ఉంటారట. ఈ ఆధ్యాత్మికతలో మనల్ని మనం పరిశీలించటంతో జర్నీ మొదలవుతుంది..అక్కడ నుంచి మన దృక్కోణం మారుతుది..దాంతోపాటు జీవితం కూడా మారుతుంది. అలాగే ఏ విషయాలకు ఎలా స్పందించాలనే విషయంపై పూర్తి అవగాహన ఉంటుంది. 

అది ఈ ప్రాపంచిక జీవన విధానంలో ఎలా మసులుకోవాలో నేర్పించడమే గాక జీవితంలో ఉన్నతంగా బతకడం వైపుకు మార్గం వేస్తుందని చెబుతున్నారు శోభిత్‌ సింగ్‌. కాగా, ఆయన కంపెనీ గుజరాత్‌కు చెందిన కాగితపు ఉత్పత్తుల సరఫరాదారు. దీని టర్నోవర్‌ కోట్లలో ఉంటుందట. అంతేగాదు ఇది ఆసియాలో అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సరఫరాదారులలో ఒకటి, పైగా US రిటైలర్ల కాగితపు ఉత్పత్తి అవసరాలను కూడా తీరుస్తుంది. ముఖ్యంగా  చిన్నారుల ఆర్ట్ సామాగ్రి, క్రాఫ్ట్ మెటీరియల్, పర్యావరణ అనుకూల స్టేషనరీ తదితర ఉత్పత్తులను అందిస్తుంది. 

(చదవండి: International Tea Day: 'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement