‘చీర్స్‌’బాబు చిక్కాడు | Drunk man gets locked inside cage meant for catching leopards | Sakshi
Sakshi News home page

‘చీర్స్‌’బాబు చిక్కాడు

Nov 29 2025 5:43 AM | Updated on Nov 29 2025 5:43 AM

Drunk man gets locked inside cage meant for catching leopards

చిరుత బోనులో చొరబడిన మందుబాబు 

బహ్రైచ్‌ (యూపీ): చిరుతపులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు.. దాన్ని పట్టుకోవడానికి బోను కూడా ఏర్పాటు చేశారు. చిరుత చిక్కలేదు.. కానీ అందులో ఒక మందుబాబు చిక్కుకుపోయాడు. ఫక్రూర్‌ ప్రాంతంలోని ఉమ్రిదేహ్లో గ్రామంలో బుధవారం ఓ మహిళను చిరుత చంపింది. దీంతో అధికారులు గ్రామం బయట మేకను ఎరగా పెట్టి ఓ బోనును సిద్ధం చేశారు. 

కానీ, గురువారం రాత్రి, స్థానిక యువకుడు ప్రదీప్‌ బాగా మందుకొట్టి.. దారిలో ఈ బోనును చూశాడు. ‘బోను ఎంత గట్టిగా ఉందో చూద్దాం.. అనుకున్నాడో.. చిరుత లోపల ఉందో లేదో? చెక్‌ చేద్దాం అనుకున్నాడో’తెలీదు.. లోపలికి అడుగు పెట్టాడు. అంతే.. ఆటోమేటిక్‌ తలుపు దడాల్న మూసుకుపోయింది. 

తాను చిక్కుకున్నానని ఎట్టకేలకు గ్రహించిన ప్రదీప్‌ గ్రామపెద్దకు ఫోన్‌ చేశాడు. సమాచారం అందుకున్న ఈ అటవీ, పోలీసు శాఖాధికారులు హుటాహుటిన రాత్రిపూట ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ‘ఆ యువకుడిని బయటకు తీయడానికి రెండు గంటల సమయం పట్టింది. మందు మత్తులో ఉన్నాడు’.. అన్నారు డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ రామ్‌ సింగ్‌ యాదవ్‌. చివరకు ప్రదీప్‌ను బయటకు తీసి, తీవ్రంగా హెచ్చరించి ఇంటికి పంపేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement