Adi Shankaracharya ఆ ఘనత... ఆదిశంకరులదే | Importance and significance of Adi Shankaracharya | Sakshi
Sakshi News home page

Adi Shankaracharya ఆ ఘనత... ఆదిశంకరులదే

May 1 2025 3:49 PM | Updated on May 1 2025 3:49 PM

 Importance and significance of Adi Shankaracharya

అద్వైత సిద్ధాంత బోధకుడిగా..నిత్యస్తోత్రాలను అందించిన అపర సరస్వతిగా... ఆలయస్థాపనకు నడుం బిగింన సాధకుడిగా...జగద్గురువు ఆదిశంకరాచార్యులు (Adi Shankaracharya) తలపెట్టని కార్యంలేదు. రేపు శంకర జయంతి సందర్భంగా జగద్గురు ఆదిశంకరుల గురించి కొన్ని విశేషాలు...!

కేరళలోని కాలడిలో ఆర్యాంబ, శివగురు దంపతులకు జన్మింన శంకరాచార్యులు చిన్నతనం నుంచీ ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవేదాంగాలనూ, ధర్మశాస్త్రాలనూ ఆపోసన పట్టిన శంకరులు తల్లి అనుమతితో సన్యాసాన్ని స్వీకరించారు. గోవింద భగవత్పాదులను గురువుగా భావించారు. గురుసేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని ప్రపంచానికి తెలియజేశారు. ముప్ఫైరెండేళ్లు మాత్రమే జీవింన శంకరాచార్యులు.. అద్వైత సిద్ధాంతాన్ని బోధించేందుకు ఆసేతు హిమాచలం దాదాపు మూడుసార్లు ఆధ్యాత్మిక యాత్రను సాగిస్తూనే సన్యాస వ్యవస్థను పదిరకాలుగా వర్గీకరించారు. నేటికీ సన్యాసాశ్రమాన్ని కొనసాగిస్తున్న వారిని ఆ పేర్లతోనే పిలుస్తున్నారంటే ఆ ఘనత శంకరాచార్యులదే. జీవాత్మ–పరమాత్మ ఒక్కటేనంటూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు.

సామాన్యులూ చదువుకునేలా...
శంకరాచార్యులు భక్తిమార్గంలో ప్రయాణించాలనుకునేవారికి ఎన్నో స్తోత్రాలను అందించారు. కనకధార స్తోత్రంతోపాటు దాదాపు 108 స్తోత్రాలూ,గ్రంథాలూ రంచారు. మనం రోజువారీ చదువుకునే శివానందలహరి, మహిషాసురమర్దిని, భజగోవిందం, కాలభైరవాష్టకమ్, గణేశ పంచరత్నం, అన్నపూర్ణస్తోత్రం... వంటివన్నీ అందింంది ఆయనే.
 

Advertisement
 
Advertisement
Advertisement