సాధారణంగా అందరూ కుడి చేతితోనే రాత రాస్తారు. ఎడమ చేతితో రాసేవారు అరుదుగా ఉంటారు. ఓ లెక్క ప్రకారం ప్రతి వందమందిలో 90 శాతం కుడిచేతి వాటం వారుంటే, మిగతా 10 శాతం మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉంటారని చెబుతారు. అయితే సామర్థ్యం, తెలివితేటలు, ప్రతిభలో లెఫ్ట్ హ్యాండర్లు ముందుంటారని సర్వేలు చెబుతున్నాయి.
లెఫ్ట్ హ్యాండర్స్‌డే ప్రాధాన్యం
అంతర్జాతీయంగా ఉన్న ఎడమ చేతి వాటం గల వారు 1976 ఆగస్టు 13న సమావేశమై అనేక అంశాల మీద చర్చించారు. ఆ సమావేశ తేదీనే లెఫ్ట్ హ్యాండర్స్ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు. కుడి చేతి రాత గల వారి ఆధిపత్యం గల సమాజంలో ఎడమ చేతి వాటం గలవారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రచారం చేయాలనుకున్నారు. ప్రపంచంలో దాదా పు 90 శాతం మందికి కుడి చేతిని ఉపయోగించి పనులు చేస్తారని సర్వేల్లో వెల్లడైంది. 10 శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటం కలిగి ఉంటారు. అయితే ప్రతిభ, సజనాత్మకత, సామర్థ్యాలు ఎడమ చేతి వాటం వారిలోనే ఎక్కువని చెబుతుంటారు.
ఎందరో ప్రముఖులు
ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్, చంద్రుడిపై మొట్టమొదట కాలుమోపిన నీల్ ఆర్మ్‌్రస్టాంగ్, మోనాలిసా సృష్టికర్త లియోనార్డ్ డావెన్సీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇండియా ప్రధాని నరేంద్రమోదీ, వ్యాపారవేత్త రతన్‌టాటా ఇలా చెప్పుకుంటూ పోతే ఎడమచేతి వాటం ప్రముఖులు చాలా
మంది ఉన్నారు.
ఇబ్బందులూ ఉన్నాయి
ఎడమచేతి వాడకంపై లాభనష్టాలు, ఇబ్బందుల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎడమచేతి వాటం ఉన్న వారు ఎంతో అదృష్టవంతులని కొందరు అంటారు. అటువంటి వారు ప్రపంచం గరి్వంచదగ్గ వ్యక్తులుగా ఎదిగారని చెబుతారు. అయితే శుభకారార్యాల్లో ఎడమ చేతి వినియోగాన్ని మన సంప్రదాయాలు అంగీకరించవు. ఇటువంటి సందర్భాల్లో ఆ అలవాటు ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు పాఠశాలల్లో విద్యార్థులు కూర్చునే కుర్చీలకు కుడిచేతివైపు రాయడానికి వీలుగా అట్ట అమరుస్తారు. అలాగే డ్రైవర్లకు కుడిచేతి వాటానికి అనుకూలంగా హారన్ మొదలైనవి ఉంటాయి.
మాన్పించారు
ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయస్సులో ఉన్నప్పటి నుంచి పిల్లలు వస్తువులను పట్టుకోవడం ప్రారంభిస్తారు. ఈ సమయంలోనే కుడి, ఎడమ చేతి వాటాలను గుర్తించవచ్చు. ఎడమ చేతి వాటాన్ని తల్లిదండ్రులు ఒక చెడు అలవాటుగా భావించి మాని్పంచేందుకు ప్రయతి్నస్తారు. అలా చేయడం వలన ఇతర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


