ధర్మాన్ని నిలిపే త్రిశక్తుల గురించి తెలుసా? | Moral Values: The Power of Sin Fear, Divine Love, and Social Ethics in Life | Sakshi
Sakshi News home page

ధర్మాన్ని నిలిపే త్రిశక్తుల గురించి తెలుసా?

Oct 27 2025 2:50 PM | Updated on Oct 27 2025 3:38 PM

Do you know about the three powers that write Dharma

పాప భీతి, దెవప్రీతి, సంఘనీతి త్రయం. ఈ మూడే మన అంతరాత్మను వెలిగించే త్రివేణి సంగమం.  అంతఃకరణసాక్షిత్వమే మనిషికి నిత్యమైన ధర్మం. ఈ ధర్మాన్ని నిలిపే త్రిశక్తులు: పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి. ఈ మూల విలువలు లోపించినప్పుడే వ్యక్తిగత జీవితంలో శాంతి నశించి, ప్రపంచం అపనమ్మకంతో నిండిపోతుంది. 

మనిషిని ధర్మబద్ధంగా నడిపించేవి ఈ మూడు: పాప భీతి (తప్పు పర్యవసానానికి భయం), దైవ ప్రీతి (విశ్వం పట్ల ప్రేమ), సంఘ నీతి (సామాజిక బాధ్యత). ఈ అంతర్గత విలువలు లోపించినప్పుడే, చట్టం చూడకపోయినా, ఎవరూ గమనించకపోయినా, మనిషి అవినీతికి, అన్యాయానికి పాల్పడతాడు. దీని పర్యవసానంగా, అంతఃకరణ శాంతి నశించి, ప్రపంచంలో నమ్మకం కొరవడుతుంది. పాప భీతి లేని ఒక వ్యాపారి, తక్షణ లాభం కోసం అక్రమాలకు, పన్ను ఎగవేతకుపాల్పడతాడు. చట్టం నుండి తప్పించుకోవచ్చు అనే ధైర్యంతో, ధర్మాన్ని పక్కన పెడతాడు. ఈ స్వార్థపూరిత చర్యలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి.

ఒక ఆటో డ్రైవర్, ప్రయాణికుడు మరచిపోయిన డబ్బు సంచిని తిరిగి అప్పగిస్తాడు. ఈపాప భీతితో కూడిన నిజాయితీ వల్ల, అతను తిరిగి ఇచ్చిన డబ్బు కంటే, ఎక్కువ గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించుకుని, తన కుటుంబానికి గొప్ప కీర్తిని అందిస్తాడు. ఈ మూడు విలువల కారణంగానే ఒక ఇంజనీర్‌ ్ర΄ాజెక్టును అత్యంత నాణ్యతతో నిర్మిస్తాడు. ఇది కేవలం పని మాత్రమే కాదు, ప్రజల జీవితాలకు భద్రత కల్పించే తన ధర్మం అని నమ్ముతాడు. ఈ నిజాయితీ అతనికి శాశ్వత కీర్తిని, క్లయింట్లలో అపారమైన నమ్మకాన్ని ఇస్తుంది. దీనికి విరుద్ధంగా, అదే ఇంజనీర్‌ నాణ్యత తగ్గించి డబ్బు సం΄ాదిస్తే, తాత్కాలికంగా ధనం వచ్చినా, ఆ ప  ప్రాజెక్టు పతనం అయినప్పుడు ఆ వ్యక్తి ఆత్మశాంతిని పూర్తిగా కోల్పోతాడు. ఈ విలువల వల్ల మీ జీవితంలో/వృత్తిలో మీకు శాశ్వత కీర్తి, తిరుగులేని నమ్మకం లభిస్తాయి. ఒత్తిడి ఎదురైనా, దైవ ప్రీతి వల్ల మనసుకు మానసిక స్థైర్యం లభిస్తుంది. ఈ విలువలు లేక΄ోతే, మీరు ఎంత డబ్బు సంపాదించినా అంతరాత్మ ప్రశాంతత నశించి, అభద్రతా భావం పెరుగుతుంది.

చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?

కుటుంబంలోనూ ఈ ప్రభావం మరీ లోతుగా ఉంటుంది. మీ నిజాయితీ మీ పిల్లలకు గొప్ప ఆస్తి. మీరు విలువలు నిర్లక్ష్యం చేస్తే, ఇంట్లో అశాంతి, అపనమ్మకం పెరుగుతాయి. పిల్లలు మాటలకంటే ఎక్కువగా, చేతలనే చూస్తారు; తల్లిదండ్రులకు పాప భీతి లోపిస్తే, పిల్లలూ నిజాయితీని కోల్పోతారు. పాప భీతి మనల్ని తప్పుల నుండి కాపాడే కఠినమైన గురువుగా రక్షిస్తుంది. దైవ ప్రీతి మనల్ని ప్రేమతో నడిపించే తల్లిగా ప్రేరణనిస్తుంది. సంఘ నీతి మనల్ని బాధ్యతాయుత  పౌరులుగా మార్చే బంధం. పాప భీతిని ఆచరించండి, దైవ ప్రీతిని పెంచుకోండి, సంఘనీతిని పాటించండి. ఈ మూడింటిని హృదయపూర్వకంగా ధరించినప్పుడే, మన వ్యక్తిగత ప్రశాంతత పెరుగుతుంది, ప్రపంచం నమ్మకం, మానవత్వంతో నిండిపోతుంది.


ప్రతి జీవిలోనూ దైవత్వం ఉందనే నమ్మకం లేనప్పుడు, మనిషిలో కరుణ, సహానుభూతి తగ్గిపోతాయి. ఫలితంగా, అతను కేవలం తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచించి, ఇతరుల బాధను, కష్టాన్ని విస్మరిస్తాడు. దైవ ప్రీతి లోపం ఉన్న ఓ పరిశ్రమ యజమాని, తక్షణ లాభం కోసం, నదుల్లో కాలుష్యాన్ని విచ్చలవిడిగా వదిలి వేస్తాడు. ఈ కలుషిత నీటిని తాగే జంతువులు, ఆధారపడిన ప్రజారోగ్యంపై పడే భయంకరమైన ప్రభావాన్ని అతను పట్టించుకోడు. భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఉండాలనే కనీస బాధ్యతను విస్మరించి, ప్రకృతి విధ్వంసానికి  పాల్పడతాడు. ఈ లోపం అతన్ని సమాజానికి, ప్రకృతికి హాని కలిగించేలా నిర్దయగా మారుస్తుంది. సంఘ నీతి లోపించిన ఒక వ్యాపారి, లాభం కోసం ఆహారంలో కల్తీ చేసి, తక్షణ లాభం పొందుతాడు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం, బాధ్యత లేని స్వార్థం వల్ల సమాజం రోగాల పాలయ్యే అవకాశం ఉంది. 
– కె. భాస్కర్‌ గుప్తా  (వ్యక్తిత్వ వికాస నిపుణులు)

ఇదీ చదవండి: ఆధ్యాత్మికత...ఆత్మదర్శనం అంటే ఏమిటి?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement