ధర్మ సందేహాలు: అయిదో తనమంటే..? | spritual Dougts: Devotional Reasons Ayido tanam ante emiti | Sakshi
Sakshi News home page

ధర్మ సందేహాలు: అయిదో తనమంటే..?

Jun 26 2025 1:30 PM | Updated on Jun 26 2025 1:30 PM

spritual Dougts: Devotional Reasons Ayido tanam ante emiti

కొన్ని ఆచార వ్యవహారాలు నేటి యువతకు పెద్దగా తెలియదనే చెప్పాలి. ఒకవేళ ఇలా చేయకూడదని హిత భోద చేసినా..ఏంటిది అని చాదస్తం అన్నట్లుగా విసుక్కుంటారు. అయితే వాళ్లు చెప్పే వాటికి నిగూఢ అర్థాలతోపాటు సమాజ హితం కూడా ఉంది. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..!. 

అయిదో తనమంటే ?
ముత్తయిదువ అని అర్థం.  పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగల్యం. స్త్రీ ఈ అయిదు అలంకరణలతో కల కల లాడుతుండాలి. స్త్రీకి  వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగల్యం వస్తాయి.

స్త్రీలు జుట్టు విరబోసుకొని  ఎందుకుండరాదు?
ఈ చర్య పిశాచాలకు ఆహ్వానం వంటిది. అనేక దుష్ట గ్రహాలూ ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది. దానికి తోడు విరబోసుకున్న స్త్రీని చూసిన పురుశిడికి ఆ స్త్రీమీద కామం కలుగుతుంది. తద్వారా కుటుంబ సమస్యలు వస్తాయి. అలాగే 
జుట్టు విరబోసుకు తిరుగుతుంటే లక్ష్మిదేవి  అక్కకు కూడా ఆహ్వానమే. 

(చదవండి: సంబురాలు మొదలాయె..! తొలి బోనం ఎప్పుడంటే..)

Advertisement
 
Advertisement
Advertisement