నైవేద్య ఫలాలు: దేవుడికి ఎలాంటి నైవేద్యం సమర్పించడం మంచిదంటే.. | Devotion: naivedhya the favorite food offerings to your gods Must Avoid | Sakshi
Sakshi News home page

నైవేద్య ఫలాలు: దేవుడికి ఎలాంటి నైవేద్యం సమర్పించడం మంచిదంటే..

May 29 2025 9:36 AM | Updated on May 29 2025 9:37 AM

Devotion: naivedhya the favorite food offerings to your gods Must Avoid

భగవంతుడికి ప్రతిఒక్కరూ తమ శక్తిమేర నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే సత్వరం మన కోరికలు తీరుతాయో సవివరంగా తెలుసుకుందామా..!.

కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) – భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

అరటి పండు – భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండుని గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.

నేరేడు పండు – శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యంగా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరోగ్య వంతులు అవుతారు.

ద్రాక్ష పండు – భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.

మామిడి పండు –  దేవుడికి మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికి పంచి ఆ తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.

అంజూర  పండు – భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండును అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

సపోటా పండు – సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.

యాపిల్‌ పండు – భగవంతుడికి యపిల్‌ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్య్రం తొలగి ధనవంతులు అవుతారు.

కమలా పండు –  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచి΄ోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

పనసపండు –  పనసపండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనం, రోగవిముక్తి కలిగి సుఖంగా ఉంటారు. 

(చదవండి: Rohini Karte 2025: ఈ సమ్మర్‌లో రోహిణి కార్తె లేనట్టేనా..? ఆ టైంలోనే రోళ్లు పగిలేలా ఎండలు పెరగడానికి రీజన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement