కోకాపేటలోని ఏఎస్‌బీఎల్ స్పైర్‌లో శ్రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన కుంభాభిషేకం, విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక అక్టోబర్ 31, 2025 శుక్రవారం ఉదయం 10:26 గంటలకు పూర్తి భక్తి శ్రద్దలతో, ఆగమ శాస్త్ర నియమాలు, తెన్నాచార్య సంప్రదాయానికి అనుగుణంగా జరిగాయి.
ASBL స్పైర్ లోపల కొత్తగా నిర్మించిన ఆలయం భక్తి, సాంస్కృతిక కొనసాగింపుకు చిహ్నంగా నిలుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. సాంప్రదాయ దక్షిణ భారత నిర్మాణ శైలిలో రూపొందించిన ఈ ఆలయ గర్భగుడి దైవిక కృప, ప్రశాంతతను వెదజల్లుతుంది.
ఈ సందర్భంగా ASBL గ్రూప్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ, “ ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు భక్తులందర్నీ దగ్గర చేస్తాయని, ఆధునిక జీవనానికి అర్థాన్ని జోడిస్తాయని మేము విశ్వసిస్తున్నాం. మా భవిష్యత్ ప్రాజెక్టులన్నింటిలో ఈ తరహా పవిత్ర స్థలాలను సృష్టించాలని, విశ్వాసం, శాంతి, సామరస్యాన్ని సమిష్టి వేడుకగా జరుపుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము”అని అన్నారు.
ఈ వేడుకకు అనేక మంది భక్తులు, నివాసితులు, ASBL కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా యాగాలు, హోమాలను నిర్వహించారు. గోవింద, హరే కృష్ణ మంత్రాలతో ప్రాంగణం మొత్తం ప్రతిధ్వనించింది.
(చదవండి: యాత్రికులు, నివాసితుల సౌకర్యార్థం రూ. ₹6.12 కోట్లతో స్పెషాలిటీ ఆస్పత్రి)


