చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది? సూతక కాలం అంటే.. | Chandra Grahan 2025: lunar eclipse date and time And Precautions | Sakshi
Sakshi News home page

Chandra Grahan 2025: చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది? సూతక కాలం అంటే..

Sep 4 2025 2:24 PM | Updated on Sep 4 2025 2:52 PM

Chandra Grahan 2025: lunar eclipse date and time And Precautions

భాద్రపద పౌర్ణమి, ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం(Chandra Grahan) ఏర్పడనుంది. గతంలో ఒకటి రెండు గ్రహణాలు వచ్చినా అవి మన దేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం మన దేశంలో లేదు. ఈ ఆదివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది. 

గ్రహణ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలనే దానిపై పండితులు చెప్పిన వాటిలో ముఖ్యాంశాలు. ఆదివారం,7న రాత్రి 9:58 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్‌ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనుంది. దీని మొత్తం వ్యవధి దాదాపు మూడున్నర గంటలు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం.

సూతక కాలం అంటే  ఏమిటి? ఆ సమయంలో ఏం చేయాలి?
హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడటానికి ముందు కొంత సమయం నుంచి, గ్రహణ సమయంతో పాటు, గ్రహణం తరువాత కొంత సమయాన్ని కలిపి సూతక కాలంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా చంద్ర గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే ఆదివారం మధ్యాహ్నం 12.57 నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. 

ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు, పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు చేసిన తరువాత తలుపులు తెరిచి యథావిధిగా పూజలు చేస్తారు. రాహుకేతు పూజలు జరిగే ఆలయాలు మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటాయి

పాటించాల్సిన నియమాలు ఏంటంటే...
గ్రహణం రోజున సూతక కాలం ఆరంభం అయినప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోరు. ఆరోగ్యం సరిగా లేని వారు ఆహారం తీసుకోకుండా ఉండలేక΄ోతే ΄ాలు, పండ్ల రసం వంటివి తీసుకుంటారు. అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భ గడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం.గ్రహణం సమయంలో శుభకార్యాలు, పూజలు, దేవాలయ దర్శనాలు చేయరు. వీలైనంత వరకు భగవన్నామ స్మరణ, ధ్యానం మంచిది. .

దానాలు శ్రేష్టం
చంద్ర గ్రహణం ముగిసిన తర్వాత సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహణ సమయంలోనూ, ఆ తర్వాతా చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

ముఖ్యంగా  శక్తిమేరకు బట్టలు, ఆహారం, ధాన్యం, డబ్బు దానం చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల గ్రహణం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నమ్మకం. అలాగే గ్రహణ స్నానం తర్వాత పితృదేవతల ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేయడం, బ్రాహ్మణులకు గోదానం వంటివి చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. ఈ ఆదివారం రానున్న చంద్ర గ్రహణం రోజు మనం కూడా పెద్దలు, శాస్త్రాలు చెప్పిన పరిహారాలు పాటించడం శ్రేయస్కరం.  

దైవారాధన ఎలా?
గ్రహణ స్నానం చేసిన తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని నిత్యపూజ చేసుకోవాలి.  

(చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement