పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా... | Guruvayur Temple Sree Krishna Temple, Thrissur, Kerala | Sakshi
Sakshi News home page

పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా...

Apr 16 2026 1:29 PM | Updated on Apr 16 2026 2:43 PM

Guruvayur Temple Sree Krishna Temple, Thrissur, Kerala

కృష్ణా... గురువాయురప్పా..! ఈ ఒక్క మాట మనకి బాగా పరిచయం ఉన్న కేరళంలో ఎక్కువ వినిపిస్తుంటుంది. కేరళం పేరు వింటే మనకి గుర్తుకు వచ్చే దేవాలయం గురువాయూర్‌. శ్రీ కృష్ణ దేవాలయాలలో కేరళలో ఉన్న గురువాయురప్పన్‌ దేవాలయం ఎంతో విశిష్టమైనది.

ఆయనను బాలగోపాలుడిగా భక్తితో కొలుస్తారు. ఆర్ద్రతతో కృష్ణా... గురువాయురప్పా అనిపిలిస్తే పలుకుతాడని కేరళవాసుల నమ్మకం. ఎంతో మంది కృష్ణ భక్తులు భక్తితో పలవరిస్తుంటారు. బాలగోపాలుడు ఇక్కడ అల్లరి చేస్తూ తిరుగుతాడు అని చూసిన వాళ్ళు చెప్తుంటారు. కురూరమ్మ బిల్వమంగళుడు వీరి ఇంట్లో అల్లరి కన్నయ్య తిరుగాడేవాడని ఇక్కడివారి నమ్మకం. 

అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తామే కురూరమ్మ బిల్వమంగళుడిగా భావిస్తుంటారు. మన తెలుగు వారు అయ్యప్ప మాల వేసుకుని దర్శనం తరువాత లేదా ముందు ఇక్కడ అల్లరి కన్నాయని గురువాయూర్‌ లో దర్శనం తప్పనిసరిగా దర్శనం చేసుకుంటారు. తాము రాధాకృష్ణులమని భావించి తులసి మాలలు వేసుకుని గురువాయూర్‌లో వివాహం చేసుకోవడం గొప్ప అనుభూతి. అలాగే అల్లరి కన్నయ్యకి నృత్యం, ఆటపాటలు అంటే ఇష్టం. 

అందుకే ప్రతిరోజు అరంగేట్రం సంగీత కచేరీలు జరుగుతుంటాయి. కన్నయ్యకి పాలు, బియ్యం పంచదార వేసి పాయసం చేసి నైవేద్యం పెడతారు. పసిపిల్లలను తులాభారం చేయిస్తారు. అలాగే మొక్కు తీర్చడానికి ఏనుగులు సమర్పించేవారు. ఆ విధంగా సుమారు 38 ఏనుగులతో పునాథూర్‌ కోటలో చూడవచ్చు. విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఏనుగులతో పరుగు పందాలు, ఏనుగులకు విందు కార్యక్రమాలు ఉంటాయి మరి కృష్ణష్టామి రోజు విశేషమైన పూజలు జరుపుతారు. 

కేరళ వాళ్ళ కొత్త సంవత్సరాది రోజు ఉదయం ఈ కన్నయ్యని ముందుగా చూస్తారు. దానిని విషు కని అంటారు. గురువు, వాయువు కలిసి నదిలో దొరికిన విగ్రహం ఇక్కడ బాల గోపాలుడి దర్శనం. ఈ ఆలయం త్రిచూర్‌ రైల్వే స్టేషన్‌కి 20 కిలోమీటర్లు లేదా కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలో ఉంది. 
– ఈఎస్‌. మాధవన్‌ 

(చదవండి: శక్తిపీఠం-సిద్ధ పీఠం వ్యత్యాసాలు..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement