దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోండి  | PM Narendra Modi calls for peace in West Asia in meet with Iranian President | Sakshi
Sakshi News home page

దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోండి 

Sep 12 2026 6:18 AM | Updated on Sep 12 2026 6:18 AM

PM Narendra Modi calls for peace in West Asia in meet with Iranian President

పశ్చిమాసియా సంక్షోభంపై ఇరాన్‌ అధ్యక్షుడి పెజెష్కియాన్‌కు మోదీ సూచన

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ప్రస్తుత నెలకొన్న సంక్షోభాన్ని చర్చలు, దౌత్య మార్గాల్లో ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌కు సూచించారు. శుక్రవారం ఇరువురు నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, ఇరాన్‌ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొడానికి పెజెష్కియాన్‌ ఢిల్లీకి చేరుకున్న తర్వాత కొద్ది గంటల్లోనే ఈ భేటీ జరగింది. 

పెజెష్కియాన్‌ ఇరాన్‌ అధ్యక్షుడి హోదాలో భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపైమోదీ, పెజెష్కియాన్‌ చర్చించారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న భారతదేశ స్థిరమైన వైఖరిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడం, నౌకాయాన స్వేచ్ఛ, వాణిజ్య కార్యకలాపాలు, నావికుల భద్రత, సంక్షేమాన్ని పరిరక్షించడం కోసం కృషి అవసరమని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్ప టికీ బ్రిక్స్‌ సమావేశాల్లో ఇరాన్‌ భాగస్వామ్యం వహిస్తున్నందుకు పెజెష్కియాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఘర్షణను నివారించడానికి సహకరించాలని మోదీని ఇరాన్‌ అధ్యక్షుడు కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement