ఓటు కోసం అమెరికన్‌ వేషం.. | Indian national charged in US for allegedly posing as american to vote | Sakshi
Sakshi News home page

ఓటు కోసం అమెరికన్‌ వేషం..

Sep 12 2026 6:09 AM | Updated on Sep 12 2026 6:09 AM

Indian national charged in US for allegedly posing as american to vote

న్యూయార్క్‌: ఓటేసేందుకు తప్పుడు సమాచారం ఇచ్చాడని, అమెరికన్‌ పౌరుడినని ప్రమాణం చేశాడని అమెరికాలోని మినసోటాలో ఓ భారతీయుడిపై ఆరోపణలు నమోదయ్యాయి. మినసోటా డి్రస్టిక్ట్‌లోని ఫెడరల్‌ గ్రాండ్‌ జ్యూరీ గురువారం ఈ మేరకు రెండు అభియోగాలను ఖరారు చేసింది. 

ఈ ఆరోపణలు రుజువైతే ఒక్కో దానికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష పడే అవకాశం ఉంది.  అమెరికాలోని మినసోటాలో ముఖేశ్‌కుమార్‌ సోమాభాయ్‌ చౌదరి 2024 నవంబరు ఐదవ తేదీకి కొంచెం అటు ఇటుగా ‘ఓటర్‌ సిగ్నేచర్‌ సర్టిఫికెట్‌’పై సంతకం పెట్టాడు. 

తాను అమెరికా పౌరుడినని ప్రమాణం చేశాడు. అయితే ఆ తరువాత జరిగిన విచారణలో అతడు అమెరికన్‌ పౌరుడు కాదన్న విషయం తెలిసింది. అమెరికాలో సాధారణ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటర్ల జాబితాను, తాము అమెరికన్‌ పౌరులమని ఇచి్చన ప్రమాణాలను తనిఖీ చేస్తారు. అనుమానిత సరి్టఫికెట్లను ఇమ్మిగ్రేషన్‌ సమాచారంతో సరిపోల్చి చూసుకుంటారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. 

ముఖేశ్‌కుమార్‌ విషయంలోనూ ఇదే జరిగింది. తాను అమెరికా పౌరుడిని కానని తెలిసి మరీ సంతకం పెట్టాడని కేవలం ఓటు వేసేందుకు తప్పుడు ప్రకటన ఇచ్చాడని అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ హర్మీత్‌ కే.ధిల్లోన్‌ తెలిపారు. ‘‘ఓటు హక్కు అమెరికన్‌ పౌరసత్వానికి లభించే పవిత్రమైన గౌరవం. అయితే అర్హులైన వారు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలోనే ఎన్నికల స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది’’అని చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement