బ్రిక్స్‌ సదస్సుకు దేశాధినేతలు, విశిష్ట అతిథులు  | Key Member Nation Leaders Attending in BRICS Summit 2026 | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌ సదస్సుకు దేశాధినేతలు, విశిష్ట అతిథులు 

Sep 12 2026 6:14 AM | Updated on Sep 12 2026 6:14 AM

Key Member Nation Leaders Attending in BRICS Summit 2026

న్యూఢిల్లీ: బ్రిక్స్‌ 18వ శిఖరాగ్ర సదస్సుకు కూటమి దేశాల అధినేతలతోపాటు పలువురు విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. శనివారం నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, భారత ప్రధాని మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్, ఈజిప్ట్‌ అధినేత అబ్దెల్‌ ఫతాహ్‌ ఎల్‌–సిసీ, ఇండోనేíసియా ప్రెసిడెంట్‌ ప్రబొవో సుబియాంతో, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్‌ అలీ, మలేíసియా ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీం, సౌదీ అరేబియా యువరాజు ఫైజల్‌ బిన్‌ ఫర్హాన్‌ అలీ సౌద్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) రాజు షేక్‌ ఖలీద్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్, బ్రెజిల్‌ విదేశీ వ్యవహారాల మంత్రి మౌరో వియేరా పాల్గొనబోతున్నారు.

 అలాగే ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో, నైజీరియా ఉపాధ్యక్షుడు సెనేటర్‌ కాషిమ్‌ షెట్టిమా, క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగెజ్‌ పారిల్లా, బెలారస్‌ విదేశాంగ మంత్రి మాక్సిమ్‌ రిజెన్‌కోవ్, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్‌ హంగ్‌ మరియు కజకిస్తాన్‌ అధ్యక్షుడు కాస్సిమ్‌–జోమార్ట్‌ టోకాయెవ్‌ సైతం హాజరు కాబోతున్నారు. బ్రిక్స్‌ కూటమిలో గత ఏడాది బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేíసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా మారాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement