పుణె: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ప్రముఖ సివిక్ యాక్టివిస్ట్ సంతోష్ పండిట్ అరెస్ట్ ఉదంతం మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశమైంది. మహరాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్, మహిళా కార్పొరేటర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో పుణె పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
సెప్టెంబర్ 3 తెల్లవారు జామున సుమారు ఒంటి గంట ప్రాంతంలో పుణె పోలీసులు కొత్రుడ్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత సంతోష్ పండిట్‌ను కోర్టులో హాజరుపరచగా, విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పుణె నగరంలో రోడ్ల దుస్థితి, ప్రమాదకర గుంతలు, వీఐపీ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ సంతోష్ పండిట్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
రాజకీయ నాయకులను, అధికారులను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వీడియోలు వైరల్ అయిన వేళ, పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఆయనను అరెస్ట్ చేయడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు, చర్చలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతున్న ఆయన గొంతును అణచివేసేందుకే ఈ అరెస్ట్ జరిగిందంటూ ఆయన మద్దతుదారులు ఆరోపిస్తుండగా.. చట్ట వ్యతిరేక, దూషణపూరిత వ్యాఖ్యలు చేయడం వల్లే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
Pune civic activist Santosh Pandit was reportedly detained at midnight after complaints over videos criticizing potholes, civic issues, VIP culture, and politicians.
FT- Muskan Lodhi#TheCSRJournal #PuneNews #CivicActivism #FreeSpeech pic.twitter.com/uWVDfSNeQS— The CSR Journal (@thecsrjournal) September 7, 2026


