5జీ వేగం తగ్గిందని.. మొబైల్‌ టవర్‌కు కట్టేశారు..! | Villagers in UP's Fatehpur tied technician To The Mobile Tower | Sakshi
Sakshi News home page

5జీ వేగం తగ్గిందని.. మొబైల్‌ టవర్‌కు కట్టేశారు..!

Sep 11 2026 6:18 PM | Updated on Sep 11 2026 6:44 PM

Villagers in UP's Fatehpur tied technician To The Mobile Tower

మనిషిని చెట్టు కట్టేయడం.. టవర్లకు కట్టేయడం అనేది ఎవరైనా తప్పు చేసిన సందర్భాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.  ఇది  ఎక్కువ గ్రామ స్థాయిలో తారస పడుతూ ఉంటుంది. ఊరంతా ఒక్కటై తప్పు చేసిన మనిషిని స్తంభాలకో, చెట్లకో, టవర్లకో కట్టేస్తూ ఉంటారు. ఇది అనాగరిక సంస్కృతే అయినా ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది.  కానీ ఇక్కడ చిత్రమేమింటంటే  ఓ వ్యక్తి ఒక సంస్థలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నందుకు ఈ అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 

దీనికి అసలు కారణం  5జీ నెట్‌వర్క్‌.. ఇది ప్రస్తుతం అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్‌. ఇది మనకు తెలిసిన విషయమే.  మొబైల్‌ చూడటంలో కానీ వాడటంలో కానీ వేగానికి అలవాటు పడిన ప్రస్తుత సమాజంలో అత్యధిక శాతం మంది.. 5జీ నెట్‌వర్క్‌ పట్ల ఆకర్షితులయ్యారనేది కాదనలేని సత్యం. 

మరి ఆ వేగంలో ఏమైనా మార్పులు వచ్చి ఆ నెట్‌వర్క్‌ స్పీడ్‌ తగ్గితే.. వారు చాలా స్పీడ్‌గా రియాక్ట్‌ అవుతారనడానికి తాజా ఘటనే ఉదాహరణ. ఇక్కడ సాటి మనిషి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నామా.. అనే సంగతిని కూడా మర్చిపోయి మరీ రెచ్చిపోయారు.

తమ ఊరిలో 5జీ నెట్‌వర్క్‌ స్పీడ్‌ తగ్గిందనే కారణంతో  సదరు సంస్థకు సంబంధించిన టెక్నీషియన్‌ను మొబైల్‌ టవర్‌కు కట్టేసిన వైనం వెలుగు చూసింది. సాధారణంగానే ఆ టెక్నీషియన్‌ ఊరిలోకి వచ్చిన సందర్భంలో గ్రామస్తులు తిరగబడ్డారు. తాము 5జీ నెట్‌వర్క్‌ను వాడుతుంటే అది ఎందుకు సరిగా పనిచేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ప్రధానంగా ఇన్‌స్టా రీల్స్‌ సరిగా స్ట్రీమింగ్‌ కావడం లేదని ఆరోపిస్తూ  సదరు టెక్నీషియన్‌ను మొబైల్‌ టవర్‌కు కట్టేసి ఎవరొస్తారో రండి అంటూ కూడా సవాల్‌ విసిరారు. దీనిపై  ఆ సంస్థకు చెందిన అధికారులు వచ్చి 5జీ నెట్‌వర్క్‌ స్పీడ్‌ను పెంచే వరకూ టెక్నీషియన్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఏమైతే కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయో వాటిని  వెంటనే ఉన్నతాధికారులు వచ్చి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఫతేపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. 

 

ఇదీ చదవండి:
కాబోయే భార్యను ఇంప్రెస్‌ చేద్దామని..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement