సాక్షి, తాడేపల్లి: ఏపీ మెగా డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరోసారి స్పందించారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోందంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
“వెరిఫికేషన్? నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్!” అంటూ జగన్ ట్వీట్ చేశారు. ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే.. అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలిందని ఆరోపించారు. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలిందని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.
𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!
Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?
𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.
𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho… pic.twitter.com/NShMVPrVmh— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2026
కేసు–1: మెరిట్ లిస్టులో పేర్లు పరిశీలిస్తే.. అసలు పేర్లే కనిపించ లేదు. కేసు–2: ఖో-ఖో అధికారులను సంప్రదిస్తే ఆ సర్టిఫికెట్ నకిలీదని చెబుతున్నారు. కేసు–3: నాగార్జున యూనివర్సిటీలో ఆరా తీస్తే అసలు ఆ స్పోర్ట్స్ ఈవెంటే జరగలేదని తేలింది. మరి 7 దశల్లో వెరిఫికేషన్ చేశామన్న ప్రభుత్వం.. ఆ తనిఖీలు ఎక్కడ చేశారు?, ఏం తనిఖీ చేశారు? అని ప్రశ్నించారు.
ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా నిర్వహించామని ఎలా చెప్పగలరు? అని అన్నారు. ఈ లోపాలే డీఎస్సీ అక్రమాలకు అవకాశం కల్పించలేదా? దీనికి నైతిక బాధ్యతను మీరు తీసుకోరా?” అంటూ చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రశ్నించారు. #MegaDSCScam హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఈ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: ఆ జీవోల మాయ ఏంటో అసలు!


