గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు! | Japan Unique Sleep Tournament, Sleep Deeply For 90 Minutes And Win ₹13.76 Lakh Prize Money | Sakshi
Sakshi News home page

Japan: గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు!

Sep 17 2026 8:44 AM | Updated on Sep 17 2026 9:00 AM

Japan announces Sleep Contest with Rs 13.76 lakh prize

నిద్రపోతూ కూడా బహుమతులు సాధించవచ్చా? ‘యస్‌’ అంటోంది జపాన్‌లో జరిగే స్లీప్‌ టోర్నమెంట్‌. టోక్యోకు చెందిన ఒక మ్యాట్రస్‌ కంపెనీ స్లీప్‌ టోర్నమెంట్స్‌ నిర్వహిస్తుంటుంది. ఈ పోటీలో బాగా నిద్రపోయిన వ్యక్తి మన కరెన్సీలో చెప్పాలంటే 13.76 లక్షలు గెలుచుకోవచ్చు. ఈ టోర్నమెంట్‌లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోటీదారులు 90 నిమిషాల వ్యవధిలో గాఢమైన, నాణ్యమైన నిద్రలోకి జారుకున్నామని నిరూపించుకోవాలి. 

ఈ టోర్నమెంట్‌లో పోటీదారుల నిద్రను ట్రాక్‌ చేసే పరికరాన్ని ఉపయోగిస్తారు. స్లీప్‌ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి ముందు పోటీదారులు కొన్ని వ్యాయామాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా రాత్రంతా మేల్కొవడం లేదా నిద్రమాత్రలు వేసుకుని తీవ్రమైన నిద్రలేమితో టోర్నమెంట్‌లో పాల్గొనడాన్ని నిషేధించారు. ఈ టోర్నమెంట్‌ వచ్చే నెల మొదటి వారంలో టోక్యోలోని షేర్‌ గ్రీన్‌ మినామీలో జరగనుంది. 

ఇదీ చదవండి: 132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్‌..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement