అందరూ వినాయక చవితి జోష్‌లో ఉన్నారు కదా..? వినాయకుడికి గజముఖం వచ్చిన కథ మీ అందరికీ తెలిసిందే..! అయితే.. వినాయకుడికి ఏనుగు తలను అతికించడానికి ముందే.. ఇలాంటి తల మార్పిడి గురించి శివ మహాపురాణంలో ఉందనే విషయం మీకు తెలుసా..? ఒక్క శివపురాణమే కాదు.. వాయు పురాణం, పద్మ పురాణంతోపాటు.. రుద్ర సంహితలో కూడా ఈ వృత్తాంతం ఉంది.
దక్ష ప్రజాపతి గురించి మీకు తెలియంది కాదు. ఆయన బ్రహ్మ మానస పుత్రుడు. ప్రజాపతి కూడా. దక్ష యజ్ఞం సమయంలో వీరభద్రుడు తన గణాలతో కలిసి వెళ్లి, దక్షుడిపై విరుచుకుపడ్డాడు. ఆగ్రహంతో.. దక్షుడి శిరస్సును ఖండించాడు. ఆ దెబ్బకు దక్షుడి తల యజ్ఞగుండంలో పడి భస్మమైపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? వినాయకుడి కంటే ముందే.. మన భారతావనిలో మరో తలమార్పిడి శస్త్రచికిత్స ఎలా జరిగింది? ఈ కింది వీడియోలో చూడండి..


