వినాయక నిమజ్జనం కోసం చెరువులో దిగి ఆరుగురు విద్యార్థుల మృతి | 6 child die in vinayaka nimajjanam in sangareddy dist | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనం కోసం చెరువులో దిగి ఆరుగురు విద్యార్థుల మృతి

Sep 16 2026 7:59 PM | Updated on Sep 16 2026 8:58 PM

6 child die in vinayaka nimajjanam in sangareddy dist

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం కోసం చెరువులో దిగి, ఈత రాకపోవడంతో ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పెద కాంజర్ల గ్రామంలోని నేరేడు చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పండుగ వాతావరణంలో జరిగిన ఈ దుర్ఘటన ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఆ చిన్నారులు అందరూ శిరీష ట్రస్ట్‌లో చదువుతున్న విద్యార్థులుగా తెలుస్తోంది.  అయితే పద్నాలుగేళ్ల లోపు పిల్లలు నిమజ్జనం కోసం నీళ్లలో దిగుతుంటే అటు పోలీస్‌ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఎందుకు ఆపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు నీళ్లలో దిగి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అక్కడున్న వారు ఆరోపిస్తున్నారు. 

ఈ తరహా ప్రమాదాల నివారణకు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు: 
పెద్దల నిరంతర పర్యవేక్షణ: పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి ఒడ్డుకు లేదా నిమజ్జన ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లనివ్వకూడదు.

నీటి లోతుపై అప్రమత్తత: నీటి ఉధృతి లేదా లోతు తెలియని చెరువులు, కాలువల్లోకి పిల్లలు దిగకుండా కట్టడి చేయాలి.

స్థానిక యంత్రాంగం ముందస్తు చర్యలు: ప్రమాదకరమైన ఘాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, ఈతగాళ్లను (లైఫ్‌గార్డ్స్) అందుబాటులో ఉంచాలి.

సురక్షిత ప్రాంతాల ఎంపిక: అధికారులు అనుమతించిన, క్రమబద్ధీకరించిన సురక్షితమైన నిమజ్జన ప్రాంతాలలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement