ఒక్క క్షణం ఆలస్యమైనా... | Viral Video In Instagram Reel | Sakshi
Sakshi News home page

ఒక్క క్షణం ఆలస్యమైనా...

Sep 17 2026 7:44 AM | Updated on Sep 17 2026 7:44 AM

Viral Video In Instagram Reel

రీల్‌ అద్భుతంగా రావాలి. ప్రత్యేకంగా కనిపించాలి. లక్షల వ్యూస్‌ కావాలి. అంతే అనుకున్నదేమో ఒక తల్లి. రీల్స్‌ మాయలో తన వెంట బిడ్డ ఉందనే సంగతిని కూడా మరిచిపోయింది. ఏమీ తెలియని ఆ చిన్నారి ప్రమాదపుటంచుల్లోకి వెళ్లినా పట్టించుకోలేదు. 

ఆందోళన కలిగించే ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ఓ మహిళ బ్రిడ్జిపై నిలుచుని రీల్స్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె వెంట ఉన్న చిన్నారి నెమ్మదిగా వంతెన అంచుల వైపునకు  పాకుతూ వెళ్లింది. కానీ ఆ తల్లి కెమెరా వైపు చూస్తూ అదేమీ గమనించలేదు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించి.. పాపను ప్రమాదం నుంచి రక్షించాడు. 

ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ చోటుచేసుకుందనే వివరాలు స్పష్టంగా లేకపోయినప్పటికి .. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనలు, రోడ్లు, నీటి ప్రదేశాలు, ఎతైన   ప్రాంతాల దగ్గర పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదని గుర్తుచేస్తున్నారు. రీల్‌ కొన్ని సెకన్ల పాటే..  కానీ చిన్నారి భద్రత మాత్రం జీవితాంతం ముఖ్యమని సూచిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement